For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీకెండ్: పెట్రోల్, డీజిల్ ధరల రేట్ల స్థితిగతులేంటీ?

|

న్యూఢిల్లీ: వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచివేస్తూ, సుమారు రెండు నెలల పాటు వాహనదారులను బెంబేలెత్తించాయి చమురు సంస్థలు. ఈ ఏడాది మే 4వ తేదీన మొదలైన ఇంధన ధరల పెరుగుదల సుమారు రెండు నెలల పాటు యథేచ్ఛగా కొనసాగింది. పెంచడానికి ముందురోజు 75 రూపాయలకు కాస్త అటు, ఇటుగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు.. వంద రూపాయల ల్యాండ్ మార్క్‌ను దాటేశాయి.. మరింత పైపైకి దూసుకెళ్లాయి. ఆయిల్ కంపెనీల వరుస బాదుడుతో వాహనదారులకు చుక్కలు కనిపించాయి.

 తగ్గింపు రేట్లే..

తగ్గింపు రేట్లే..

వాహనం బయటికి తీయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది అప్పట్లో. ఈ వరుస పెంపుదలకు పుల్‌స్టాప్ పెట్టాయి చమురు సంస్థలు. కొంతకాలంగా ఇంధన ధరల పెంపుదల జోలికి వెళ్లలేదు. పైగా కొంతమేర తగ్గించుకుంటూ వస్తోన్నాయి. సెప్టెంబర్ నెల ప్రారంభం రోజు.. వాటి రేట్లను మరోసారి స్వల్పంగా తగ్గించాయి. పెట్రోల్‌‌పై లీటర్ ఒక్కింటికి 10 నుంచి 15 పైసలు, డీజిల్‌పై లీటర్ ఒక్కింటికి 14 నుంచి 15 పైసల మేర తగ్గించాయి.

 నాలుగోరోజూ..

నాలుగోరోజూ..

వరుసగా నాలుగో రోజు ఇంధన ధరల్లో స్థిరత్వం కనిపించింది. ఎలాంటి పెంపు గానీ, తగ్గింపు గానీ చోటు చేసుకోలేదు. శుక్రవారం నాటి రేట్లే ఇవ్వాళ కూడా కొనసాగుతోన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరల్లో చెప్పుకోదగ్గ మార్పులు లేవు. దాని ప్రభావంతో యధాతథ స్థితిని కొనసాగింపజేశాయి చమురు సంస్థలు. ఇదే స్థితి మున్ముందు కనిపిస్తుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది. ఇంధన ధరలను తగ్గిస్తూ వస్తోన్నందున.. ఆయిల్ కంపెనీలు ఇదే ట్రెండ్‌ను కొనసాగించే అవకాశాలు లేకపోలేదు.

వివిధ నగరాల్లో రేట్లివీ..

వివిధ నగరాల్లో రేట్లివీ..

ఈ తెల్లవారు జామున 6 గంటలకు నమోదైన రేట్ల ప్రకారం.. దేశ రాజధానిలో పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికి రూ.101.34 పైసలుగా ఉంది. డీజిల్ రూ.88.77 పైసలు పలుకుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రేటు 107.39 పైసలుగా నమోదైంది. డీజిల్ ధర రూ.96.33 పైసలకు చేరింది. కోల్‌కతలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.101.72 పైసలకు చేరగా డీజిల్ రూ.91.84 పైసలు పలుకుతోంది. చెన్నైలో పెట్రోల్ రూ.99.08 పైసలు, డీజిల్ రూ.99.38 పైసలుగా రికార్డయింది.

హైదరాబాద్‌లో..

హైదరాబాద్‌లో..

దేశంలో అనేక రాష్ట్రాలతో పోల్చుకుంటే తమిళనాడులోనే ఇంధన ధరలు ఒకింత తక్కువగా ఉంటోన్నాయి. తమిళనాడు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై మూడు రూపాయల పన్నును తగ్గించడమే దీనికి కారణం. భోపాల్‌లో పెట్రోల్ రూ.109.58 పైసలకు చేరగా, డీజిల్ రూ.97.40 పైసలుగా నమోదైంది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.105.40 పైసలు, డీజిల్ రూ.96.84 పైసలు, బెంగళూరులో పెట్రోల్ రూ.104.84 పైసలు, డీజిల్ ధర తగ్గి రూ.94.19 పైసలకు చేరింది. లక్నోలో పెట్రోల్ రూ.98.29 పైసలు, డీజిల్ రూ.89.02 పైసలుగా నమోదైంది.

రూ.100 ప్లస్..

రూ.100 ప్లస్..

అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.98.39 పైసలు, డీజిల్ రూ.95.85 పైసలు పలుకుతోంది. ఇంధన రేట్లు కాస్త తగ్గుముఖం పట్టడం కొంత ఊరట కలిగించినట్టయింది. నామమాత్రపు తగ్గింపు కావడం వల్ల అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ రేటు 100 రూపాయలపైగానే ఉంటోంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశా, జమ్మూ కాశ్మీర్, లఢక్ వంటి పలు చోట్ల వంద రూపాయల మార్క్‌కు దిగువకు నమోదు కాలేదు.

 గ్యాస్ భయం..

గ్యాస్ భయం..

ఇంధన ధరలను తగ్గించిన రోజే వంటగ్యాస్ సిలిండర్ల రేట్లను చమురు సంస్థలు పెంచేసిన విషయం తెలిసిందే. ఎల్పీజీ సిలిండర్ ఒక్కింటికి 25 రూపాయలను పెంచేశాయి. రెండువారాల వ్యవధిలో ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు కంపెనీలు పెంచేయడం అది రెండోసారి. ఇదివరకు- ఈ నెల 18వ తేదీన తొలిసారిగా వంటగ్యాస్ సిలిండర్ల ధరను 25 రూపాయల మేర అదనపు భారాన్ని మోపాయి. అంతలోనే మరోసారి పెంపుదలకు పూనుకున్నాయి. మళ్లీ 25 రూపాయలను పెంచాయి.

English summary

వీకెండ్: పెట్రోల్, డీజిల్ ధరల రేట్ల స్థితిగతులేంటీ? | Petrol, diesel prices today on September 4, 2021: rates unchanged, check here for your city

Petrol and diesel prices remained unchanged for the third consecutive day across metros on September 4. Accordingly, the price of petrol and diesel remains unchanged at Rs 101.34 and Rs 88.77 per litre in Delhi.
Story first published: Saturday, September 4, 2021, 10:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X