పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 17వ రోజు కూడా వాహనదారులకు షాకిచ్చాయి. మంగళవారం (జూన్ 23) ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పైన 20 పైసలు, లీటర్ డీజిల్ పైన 63 పైసలు పెరిగింది. కరోనా మహమ్మారి లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలల పాటు చమురురంగ సంస్థలు ధరల్ని సమీక్షించలేదు. జూన్ 7వ తేదీ నుండి ధరల సమీక్ష ప్రారంభమైనప్పటి నుండి రోజురోజుకు పెరుగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నాయి.

వివిధ నగరాల్లో ధరలు
నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వివిధ నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ లీటర్ పైన వరుసగా... ఢిల్లీలో పెట్రోల్ రూ.79.76, డీజిల్ రూ.79.40, జైపూర్‌లో రూ.87.01, రూ.80.36, ముంబైలో రూ.86.54, రూ.77.76గా ఉంది. పది ముఖ్య నగరాల్లో లీటర్ పెట్రోల్ రూ.80కి పైకి చేరుకుంది. కోల్‌కతా(రూ.81.45), ముంబై(రూ.86.54), చెన్నై(రూ.83.04), నోయిడా(రూ.80.45), బెంగళూరు (రూ.82.35), భువనేశ్వర్ (రూ.80.32), హైదరాబాద్ (రూ.82.79), జైపూర్ (రూ.87.01), లక్నో(రూ.80.55), పాట్నా (రూ.82.85), తిరువనంతపురం(రూ.81.48)గా ఉంది. డీజిల్ ధరలు ముంబై, చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్, హైదరాబాద్, జైపూర్, పాట్నా, తిరువనంతపురంలలో ఎక్కువగా ఉన్నాయి.
హైదరాబాద్‌లో డీజిల్ ధర రూ.77.60గా ఉంది.

17 రోజుల్లో ఎంత పెరిగిందంటే
జూన్ 7వ తేదీ నుండి సమీక్ష ప్రారంభించిన ఈ పదిహేడు రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.8.50, లీటర్ డీజిల్ ధర రూ.10.01 పైగా పెరిగింది.

ఢిల్లీలో
ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు సమానంగా ఉన్నాయి. ఈ రెండు ఇంధనాల మధ్య తేడా కేవలం 36పైసలు మాత్రమే ఉంది. సాధారణంగా పెట్రోల్ కంటే డీజిల్ ధర ఎక్కడైనా దాదాపు రూ.5 నుండి రూ.8 వరకు తక్కువ ఉంటుంది. ఉదాహరణకు ముంబైలో పెట్రోల్, డీజిల్ మధ్య తేడా రూ.8కిపైగా ఉంది. వివిధ రాష్ట్రాల ట్యాక్స్, వ్యాట్‌ను బట్టి ఆయా ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడా ఉంటుంది. కేజ్రీవాల్ ప్రభుత్వం పెట్రోల్ పైన వ్యాట్‌ను 27 శాతం నుండి 30 శాతానికి, డీజిల్ పైన వ్యాట్‌ను 16.75 శాతం నుండి దాదాపుగా డబుల్ పెంచి 30 శాతం చేసింది. దీంతో డీజిల్ ధర ఢిల్లీలో ఎక్కువగా ఉంది. ఢిల్లీలో వ్యాట్ హైక్ తర్వాత డీజిల్ పైన రూ.7.10 పెరగగా, పెట్రోల్ పైన రూ.1.67 పెరిగింది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications