For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరుసగా 6వ రోజు పెరిగిన ఇంధన ధరలు, అక్కడ రూ.5 తగ్గిన పెట్రోల్!

|

పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఆరవ రోజు పెరిగాయి. దేశీయ చమురు రంగ కంపెనీలు (OMC) పెట్రోల్ పైన 29 పైసలు, డీజిల్ పైన 34 పైసలు పెంచాయి. తాజా సవరణతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.88.73కు చేరుకొని గరిష్టాన్ని తాకింది. డీజిల్ లీటర్ రూ.79 మార్కు క్రాస్ చేసింది. నేడు ఈ ధర రూ.79.06గా ఉంది. మంగళవారం నుండి ధరలు పెరుగుతున్నాయి. దీంతో పలు మెట్రో నగరాల్లో ధరలు ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతుండటంతో ఈ ప్రభావం దేశీయ ఇంధన ధరలపై పడుతోంది.

వివిధ నగరాల్లో ధరలు

వివిధ నగరాల్లో ధరలు

తాజా సవరణతో పెట్రోల్ ధర లీటర్‌కు వివిధ నగరాల్లో ఇలా ఉంది. ఢిల్లీలో రూ.88.73, ఆర్థిక రాజధాని ముంబైలో రూ.95 క్రాస్ చేసి, రూ.95.21, కోల్‌కతాలో రూ.90.01, చెన్నైలో రూ.90.96, హైదరాబాద్‌లో రూ.92.26, లక్నోలో రూ.87.44, జైపూర్‌లో రూ.95.17, బెంగళూరులో రూ.91.70గా ఉంది. లీటర్ డీజిల్ ధర వివిధ నగరాల్లో ఇలా ఉంది. ఢిల్లీలో రూ.79.06, ముంబై రూ.86.04, కోల్‌కతాలో రూ.82.65, చెన్నైలో రూ.84.16, హైదరాబాద్‌లో రూ.86.23, జైపూర్‌లో రూ.87.38గా ఉంది.

ఆరు రోజుల్లో ఎంత పెరిగిందంటే

ఆరు రోజుల్లో ఎంత పెరిగిందంటే

ఈ వారంలో వరుసగా ఆరు రోజుల పాటు ధరలు పెరిగాయి. ఈ వారంలో పెట్రోల్ లీటర్‌కు రూ.1.81, డీజిల్ రూ.1.85 పెరిగింది. వరుసగా పెట్రోల్ ధరలు పెరగడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 2021 సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ ధరలు జనవరి 6, 2021 నుండి పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలు కరోనా నుండి క్రమంగా కోలుకోవడం, ఒపెక్ దేశాలు ఉత్పత్తిని తగ్గించడం వంటి వివిధ కారణాలతో ఇంధన డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఇంధన ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్నాయి. చమురు రంగ కంపెనీలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సమీక్షిస్తాయి.

అక్కడ రూ.5 తగ్గిన ధర

అక్కడ రూ.5 తగ్గిన ధర

ఇదిలా ఉండగా, పెట్రోల్, డిజిల్ ధరలు శుక్రవారం రాత్రి నుండి అసోంలో రూ.5 తగ్గింది. అదేసమయంలో లిక్క్ పైన కూడా 25 శాతం అదనపు సెస్‌ను కూడా ప్రభుత్వం తొలగించింది. కరోనా నేపథ్యంలో గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఇంధనం, లిక్కర్ పైన 5 శాతం అదనపు సెస్ విధించింది. ఇప్పుడు దీనిని తొలగించింది.

English summary

వరుసగా 6వ రోజు పెరిగిన ఇంధన ధరలు, అక్కడ రూ.5 తగ్గిన పెట్రోల్! | Petrol, diesel prices at record high as rates hiked for sixth straight day on Sunday

Petrol, diesel rates were hiked across the country for the sixth straight day on Sunday. The state-run Oil Marketing Companies (OMC) increased fuel prices by 29 and 34 paise per litre respectively.
Story first published: Sunday, February 14, 2021, 9:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X