For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒకరోజు తగ్గింపు తర్వాత, స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు

|

పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (ఏప్రిల్ 16, శుక్రవారం) స్థిరంగా ఉన్నాయి. పదిహేను రోజుల తర్వాత చమురు ధరలు నిన్న స్వల్పంగా తగ్గాయి. నేడు యథాతథంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.90.40, లీటర్ డీజిల్ రూ.80.73గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.96.83, డీజిల్ రూ.87.81, చెన్నైలో పెట్రోల్ రూ.92.43, డీజిల్ రూ.85.75, కోల్‌కతాలో పెట్రోల్ రూ.90.62, డీజిల్ రూ.83.61గా ఉంది.

NPS గుడ్‌న్యూస్, 70 ఏళ్లకూ చేరవచ్చు! ఉపసంహరణ పరిమితి కూడా పెంపుNPS గుడ్‌న్యూస్, 70 ఏళ్లకూ చేరవచ్చు! ఉపసంహరణ పరిమితి కూడా పెంపు

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు గురువారం నాడు దాదాపు నెల రోజుల గరిష్టం వద్ద ఉన్నాయి. పాజిటివ్ అమెరికా ఎకనమిక్ డేటా, హయ్యర్ డిమాండ్ అంచనాల నేపథ్యంలో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. డిమాండ్ తగ్గిన నేపథ్యంలో గత కొంతకాలంగా ఉత్పత్తిని తగ్గిస్తోన్న ఒపెక్ దేశాలు క్రమంగా పెంచుతున్నాయి. 2021లో గ్లోబల్ ఆయిల్ డిమాండ్ క్రమంగా పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి.

Petrol, diesel price revision on hold again a day after cuts

దేశీయ చమురు రంగ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం కంపెనీలు ప్రతి రోజు ఉదయం 6 గంటలకు అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా చమురు ధరలను సవరిస్తాయి. ప్రస్తుతం గ్లోబల్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 67 డాలర్ల వద్ద ఉంది.

English summary

ఒకరోజు తగ్గింపు తర్వాత, స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు | Petrol, diesel price revision on hold again a day after cuts

Fuel prices in the country remained unchanged on Friday a day after oil marketing companies decided to cut the retail price to pass the benefit of softer global oil prices to the consumers.
Story first published: Friday, April 16, 2021, 16:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X