For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు, 10 రోజుల్లో ఎంత పెరిగాయంటే

|

పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పదో రోజు పెరిగాయి. జూన్ 7, ఆదివారం నుండి చమురు ధరలు ప్రతిరోజు పెరుగుతున్నాయి. తాజాగా మంగళవారం (జూన్ 16) లీటర్ పెట్రోల్ పైన 47 పైసలు, లీటర్ డీజిల్ పైన 57 పైసలు పెంచుతూ చమురు రంగ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. కరోనా - లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలల పాటు ధరలను సమీక్షించలేదు. జూన్ 7వ తేదీ నుండి సమీక్షిస్తున్న కంపెనీలు ప్రతి రోజు పెంచుతున్నాయి.

<strong>రూ.500 కోట్లతో రక్షణరంగంలోకి.. హైదరాబాద్ సంస్థ కీలక అడుగు</strong>రూ.500 కోట్లతో రక్షణరంగంలోకి.. హైదరాబాద్ సంస్థ కీలక అడుగు

వివిధ నగరాల్లో ధరలు ఇలా...

వివిధ నగరాల్లో ధరలు ఇలా...

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్ సైట్ డేటా ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.76.73, డీజిల్ రూ.75.19 గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 83.62, డీజిల్ రూ.73.75గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.78.55, డీజిల్ లీటర్ రూ.70.84గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ.80, డీజిల్ రూ.73.17గా ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాదులో పెట్రోల్ రూ.79.65, డీజిల్ రూ.73.49, అమరావతిలో పెట్రోల్ రూ.80.02, డీజిల్ రూ.73.87గా ఉంది.

10 రోజుల్లో ఎంత పెరిగిందంటే

10 రోజుల్లో ఎంత పెరిగిందంటే

కరోనా మహమ్మారి దెబ్బకు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గాయి. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఈ పది రోజుల్లో పెట్రోల్ లీటర్‌కు రూ.5.47, డీజిల్ రూ.5.80 పైసలు పెరిగింది.

జెట్ ఫ్యూయల్ ధర కూడా పెంపు

జెట్ ఫ్యూయల్ ధర కూడా పెంపు

పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు కూడా పెరిగాయి. చమురు రంగ సంస్థలు ఈ నెలలో జెట్ ఫ్యూయర్ ధరలను పెంచడం ఇది రెండోసారి. ఢిల్లీలో ATF ధరలు 16.3 శాతం పెరిగాయి. కిలో లీటర్ (KL) రూ.5,494.5 పెరిగిన తర్వాత ఇప్పుడు రూ.39,069.87గా ఉంది. రాష్ట్రాల లోకల్ ట్యాక్స్‌ను అనుసరించి ఏటీఎఫ్ ధరల్లో స్వల్ప తేడాలు ఉంటాయి. ఏటీఎఫ్ ధరలను ప్రతి నెలలో 1 తేదీన, 16వ తేదీన సమీక్షిస్తారు. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజువారీగా సమీక్షిస్తాయి కంపెనీలు.

English summary

మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు, 10 రోజుల్లో ఎంత పెరిగాయంటే | Petrol, diesel price hiked sharply for 10th consecutive day

Fuel prices were on Tuesday hiked sharply hiked for the tenth consecutive day as part of the daily revision by Oil Marketing Companies (OMCs).
Story first published: Tuesday, June 16, 2020, 11:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X