For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూడ్రోజుల పెరుగుదల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా..

|

పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (మే 13, గురువారం) స్థిరంగా ఉన్నాయి. నిన్నటి వరకు వరుసగా మూడు రోజుల పాటు ఇంధన ధరలు పెరిగాయి.దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. ఈ మే నెలలో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ పైన రూ.1.65, లీటర్ డీజిల్ పైన రూ.1.88 పెరిగింది. నిన్న పెట్రోల్ ధరలు 25 పైసలు, డీజిల్ ధరలు 25 పైసలు పెరిగింది. ఈ నెలలో ఏడోసార్లు పెరిగాయి. గత వారం వరుసగా నాలుగు రోజులు, ఈ వారం వరుసగా మూడు రోజులు పెరిగాయి. గత శనివారం, ఆదివారం మాత్రం ధరల్లో మార్పులేదు.

రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పెట్రోల్ రూ.100 మార్కును దాటింది. పెట్రోల్ జైసల్మేర్‌లో రూ.101కి చేరువైంది. బికానీర్‌ను అదే పరిస్థితి. బార్మెర్‌లో రూ.100 క్రాస్ అయింది. మహారాష్ట్రలోని నాందెడ్‌లో పెట్రోల్ రూ.100.50 పైసలు దాటింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పైన కేంద్ర పన్నులు రూ.32.98 కాగా, రాష్ట్ర ప్రభుత్వ సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ రూ.19.55గా ఉంది. డీజిల్ విషయానికి వస్తే లీటర్ పైన ఎక్సైంజ్ డ్యూటీ రూ.31.83 కాగా, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ రూ.10.99గా ఉంది. వీటితో పాటు డీలర్ కమిషన్ పెట్రోల్ పైన రూ.2.6, డీజిల్ పైన రూ.2గా ఉంది.

Petrol, Diesel Price Hike Paused After Three Days

పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధరలను బట్టి మారుతాయి. బ్రెంట్ క్రూడ్ ధర ప్రస్తుతం 70 డాలర్లకు సమీపంలో ఉంది. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 15 సెంట్లు లేదా 0.2 శాతం పెరిగి 68.70 డాలర్లు పలికింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 21 సెంట్లు లేదా 0.3 శాతం పెరిగి 65.49 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

English summary

మూడ్రోజుల పెరుగుదల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా.. | Petrol, Diesel Price Hike Paused After Three Days

The country's largest fuel retailer Indian Oil Corporation has left the petrol prices unchanged across the metros on Thursday i.e. May 13 after a hike for three consecutive days. The prices had touched fresh all-time highs on the previous day. The fuel prices have been hiked seven times since May 4, when the state-owned oil companies ended an 18-day hiatus in rate revision observed during assembly elections in states such as West Bengal.
Story first published: Thursday, May 13, 2021, 10:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X