For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

4 నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెరిగాయంటే?

|

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలుతగ్గడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు నిన్న తగ్గాయి. నేడు(ఆదివారం, సెప్టెంబర్ 13) యథాతథంగా ఉన్నాయి. శనివారం పెట్రోల్ ధరలు దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పైన 13 పైసలు, డీజిల్ పైన 12 పైసలు తగ్గిన విషయం తెలిసిందే. రూ.81.99గా ఉన్న లీటర్ పెట్రోల్ ధర నిన్న రూ.81.86కి తగ్గింది. గత ఆరు నెలల్లో పెట్రోల్ ధరలు తగ్గడం ఇది రెండోసారి. డీజిల్ రూ.73.05 నుండి రూ.72.93కు దిగి వచ్చింది.

పెట్రోల్ ధరలు ఆరు నెలల్లో మొదటిసారి సెప్టెంబర్ 10వ తేదీన 9 పైసలు తగ్గాయి. ఆ తర్వాత రెండు రోజుల్లోనే 12వ తేదీన తగ్గాయి. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దాదాపు మూడు నెలల పాటు ధరలను సమీక్షించలేదు. ఆ తర్వాత సమీక్షించినప్పటికీ ధరలు తగ్గలేదు. క్రమంగా పెరుగుతూ వచ్చాయి. నిన్న హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు 13 పైసల చొప్పున తగ్గాయి. దీంతో లీటర్ పెట్రోల్ రూ.85.27కి తగ్గగా, డీజిల్ రూ.79.54గా ఉంది.

అక్టోబర్ 1 నుండి గుర్తుంచుకోండి! విదేశాలకు పంపే నిధులపై 5% పన్ను, విద్యార్థులకు ఊరటఅక్టోబర్ 1 నుండి గుర్తుంచుకోండి! విదేశాలకు పంపే నిధులపై 5% పన్ను, విద్యార్థులకు ఊరట

Petrol, diesel get cheaper as crude falls

డీజిల్ ధరలు మొదటిసారి సెప్టెంబర్ 3వ తేదీన తగ్గించాయి ఇంధన సంస్థలు. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్(IOC), భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (BPCL), హిందూస్తాన్ పెట్రోలియం లిమిటెడ్ (HPCL)లు వరుసగా 82 రోజుల పాటు ధరలను సమీక్షించలేదు. తిరిగి ధరలు సవరించడం ప్రారంభించిన జూన్ 7వ తేదీ నుండి జూలై 25వ తేదీ మధ్య డీజిల్ ధరలు రూ.12.55 పైసలు పెరిగాయి.

జూన్ 7వ తేదీ నుండి జూన్ 29వ తేదీ మధ్య పెట్రోల్ రూ.9.17 పైసలు పెరిగింది. ఆ తర్వాత ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆగస్ట్ 16వ తేదీన మళ్లీ సవరణ ప్రారంభమైంది. అఫ్పటి నుండి పెట్రోల్ ధర రూ.1.51 పెరిగింది. జూన్ 7వ తేదీ నుండి మొత్తంగా రూ.10.68 పైసలు పెరిగింది.

English summary

4 నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెరిగాయంటే? | Petrol, diesel get cheaper as crude falls

Petrol and diesel prices in the country have fallen again in the wake of softening in global oil prices as extended run of Covid-19 depressed demands and created in glut in the market.
Story first published: Sunday, September 13, 2020, 10:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X