న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా తొమ్మిదవ రోజు పెరిగాయి. దేశవ్యాప్తంగా ధరలు సరికొత్త రికార్డును నమోదు చేశాయి. నేడు (ఫిబ్రవరి 17, బుధవారం) లీటర్ పెట్రోల్, డీజిల్ పైన 25 పైసల చొప్పున పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో దేశీయ చమురురంగ కంపెనీలు ధరలను పెంచాయి. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతుండటం వాహనదారులను ఆందోళనకు గురి చేస్తోంది. డీజిల్ ధరల ప్రభావం నిత్యావసర వస్తువులపై ఉంటుంది.

వివిధ నగరాల్లో ధరలు
పెట్రోల్ ధర లీటర్ పైన నేడు 25 పైసలు పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీలో రూ.89.51గా ఉంది. డీజిల్ ధర రూ.79.95గా ఉంది. తాజా పెరుగుదలతో రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో ధరలు సరికొత్త గరిష్టాలను తాకాయి. వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా...
శ్రీగంగానగర్ - పెట్రోల్ రూ.100.13 - డీజిల్ రూ.92.13
న్యూఢిల్లీ - రూ.89.54 - రూ.79.95
ముంబై - రూ.96.00 - రూ.86.98
కోల్‌కతా - రూ.90.78 - రూ.83.54
చెన్నై - రూ.91.68 - రూ.85.01
బెంగళూరూ - రూ.92.54 - రూ.84.75
హైదరాబాద్ - రూ.93.10 - రూ.87.20
పాట్నా - రూ.91.91 - రూ.85.18
జైపూర్ - రూ.96.01 - రూ.88.34
లక్నో - రూ.88.06 - రూ.80.33
తిరువనంతపురం - రూ.91.42 - రూ.85.93

పన్నుల వాటానే అధికం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్సులు కలిపి రిటైల్ డీజిల్ పైన 56 శాతం, రిటైల్ పెట్రోల్ పైన 61 శాతం పన్నులు ఉంటాయి. ఇటీవలె ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచిన విషయం తెలిసిందే. ఎల్పీజీ సిలిండర్ ధర పెరుగుదల తర్వాత ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.769గా ఉంది. ఇంధన ధరలు ఇలా అమాంతం పెరుగుతుంటే సామాన్యుడిపై తీవ్ర ప్రభావం పడుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇంధన ధరలు తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరుతున్నాయి.

మేఘాలయ వాసులకు సీఎం గుడ్‌న్యూస్
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.7 చొప్పున తగ్గుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఉపశమనం కలిగించేలా, వారు నష్టపోకుండా తగ్గించే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మేఘాలయలో పెట్రోల్ రూ.92, డీజిల్ రూ.85 దగ్గరకు చేరుకుంది. ధరలు భారీగా పెరుగుతున్నందున కరోనా క్లిష్ట పరిస్థితుల్లోని పెట్రోల్, డీజిల్ వ్యాట్‌ను తగ్గించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications