For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2000 Notes: రూ.2000 నోట్లుంటే త్వరపడండి.. 58 రోజులు మార్చుకోవటం కుదరదు..!!

|

2000 Notes: సామాన్యుల దగ్గర చూద్దామన్నా కనిపించని రెండు వేల నోట్లు.. కొందరి దగ్గర మాత్రం కట్టలు కట్టలు ఉన్నాయి. పెద్ద మెుత్తంలో రూ.2000 నోట్లను కలిగి ఉన్న చాలా మంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ఈ క్రమంలో కొందరు బంగారం, వెండి కొనుగోలు ద్వారా నోట్లను మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే మరికొందరు రియల్టీ ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు. మరికొందరైతే చిన్నగా నోట్లను పెట్రోల్ బంకుల్లో మార్చుకోవాలని చూస్తున్నారు. ఇలా చేయటం ద్వారా ఆదాయపు పన్ను అధికారుల కళ్లలో పడకుండా జాగ్రత్త పడుతున్నారు.

2000noteexchange

అయితే బ్యాంకుల్లో నేరుగా వెళ్లి నోట్లను మార్చుకుంటున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలుస్తోంది. అది కూడా తక్కువ నోట్లను వారు మార్చుకుంటున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో కొందరు ఎక్కువ నోట్లుండే వారు బ్యాంకు మేనేజర్లు, ఇతర సిబ్బంది సహాయం పొందుతూ నోట్లను మార్చుకుంటున్నట్లు వినికిడి. కానీ నేరుగా నోట్లను మార్చుకోవటానికి సెప్టెంబరు 30 వరకు రిజర్వు బ్యాంక్ అధికారికంగా అవకాశం కల్పించింది.

అయితే దాదాపు రెండు నెలల పాటు నోట్లను మార్చుకోవటం కుదరదని గుర్తుంచుకోండి. అవును సెప్టెంబరు 30 వరకు దాదాపు 58 రోజుల పాటు బ్యాంకులు సెలవులో ఉంటున్నందున నోట్లను కలిగి ఉన్న వ్యక్తులు ముందస్తుగా మేల్కొనాలి. జూన్ నెలలో 12 రోజులు, జులైలో 15 రోజులు, ఆగష్టులో 14 రోజులు, సెప్టెంబరు నెలలో 17 రోజుల పాటు బ్యాంకులు సెలవుల్లో ఉన్నాయి. వీటిలో ఆదివారాలు, పండుగలు, రెండవ శనివారాలు కలిపి ఉన్నాయి.

అందువల్ల బ్యాంకుల్లో రెండు వేల నోట్లు జమచేయాలనుకున్నా లేక మార్చుకోవాలనుకునే వారు తప్పకుండా బ్యాంకు సెలవులను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి.

English summary

2000 Notes: రూ.2000 నోట్లుంటే త్వరపడండి.. 58 రోజులు మార్చుకోవటం కుదరదు..!! | people can't exchange 2000 notes with banks amid 58 days holidays till september

people can't exchange 2000 notes with banks amid 58 days holidays till september
Story first published: Saturday, May 27, 2023, 15:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X