For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రియాల్టీలోకి భారీగా తగ్గిన పీఈ పెట్టుబడులు

|

రియల్ ఎస్టేట్ రంగంలోకి పెట్టుబడులు తగ్గాయి. గతంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిన ప్రయివేట్ ఈక్విటీ సంస్థలు ఇప్పుడు వేచిచూసే ధోరణితో ఉన్నాయి. గత ఏడాది ఆర్థిక మందగమనం, ఈసారి కరోనా కారణంగా 2020 జనవరి నుండి ఆగస్ట్ మధ్య ఈ ఎనిమిది నెలల్లో ప్రయివేట్ ఈక్విటీ పెట్టుబడులు 85 శాతం మేర క్షీణించాయి. గత ఏడాది ఇదే సమయంలో 579.5 కోట్ల డాలర్లు రాగా, ఈసారి 86.6 కోట్లకు పడిపోయాయి. ఇందుకు సంబంధించిన వివరాలను కొలియర్స్ ఇంటర్నేషనల్, ఫిక్కీ సంయుక్త నివేదిక వెల్లడించింది.

అక్టోబర్ 1 నుండి కొత్త నిబంధనలు, హెల్త్ ఇన్సురెన్స్ ప్రీమియం 20% వరకు భారం!అక్టోబర్ 1 నుండి కొత్త నిబంధనలు, హెల్త్ ఇన్సురెన్స్ ప్రీమియం 20% వరకు భారం!

నివేదిక ప్రకారం... మొత్తం పెట్టుబడుల్లో గరిష్టంగా 46 శాతం డేటా సెంటర్స్ విభాగం ఆకర్షించింది. ఆఫీస్ సెగ్మెంట్ విషయంలో ఇది 24 శాతం కాగా, వ్యాల్యూగా రూ.1500 కోట్లు. ఇండస్ట్రియల్ విభాగం వాటా 12 శాతంగా ఉంది. ఆతిథ్య రంగం వాటా 9 శాతం ఉంది. హౌసింగ్, రెంటల్ హౌసింగ్ విభాగానిది 8 శాతంగా ఉంది. కో-లివింగ్ వాటా 1 శాతంగా ఉంది.

PE inflow in real estate down 85 percent in Jan to Aug at $866 million

కరోనా నేపథ్యంలో దేశీయ, విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. క్లౌడ్ కంప్యూటింగ్‌కు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా పెట్టుబడులకు డేటా సెంటర్లపై దృష్టి సారించే అవకాశాలు ఉంటాయి. చౌక ధరలు, ఓ మోస్తారు ఖర్చుతో నిర్మించే నివాసాలకు సంబంధించిన ప్రాజెక్టులపై పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. రియాల్టీలో ప్రస్తుతం మందగమనం ఉన్నప్పటికీ ముందుముందు పుంజుకోవచ్చు.

English summary

రియాల్టీలోకి భారీగా తగ్గిన పీఈ పెట్టుబడులు | PE inflow in real estate down 85 percent in Jan to Aug at $866 million

Private equity investment in Indian real estate plunged 85 percent during January-August period of this year at USD 866 million (around Rs 6,500 crore) as investors remained cautious due to the COVID-19 pandemic, according to Colliers International and FICCI report.
Story first published: Thursday, September 24, 2020, 20:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X