For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ 'క్రెడిట్'పై 2% ఛార్జీ వసూలు చేయనున్న పేటీఎం.. ఎందుకంటే

|

క్రెడిట్ కార్డు ద్వారా పేటీఎం కస్టమర్లు తమ ఈ-వ్యాలెట్‌కు నగదును యాడ్ చేసుకుంటే 2 శాతం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు క్రెడిట్ కార్డు నుండి తమ ఈ-వ్యాలెట్లలోకి నెలకు రూ.10వేలకు మించి జత చేసుకుంటే రెండు శాతం ఫీజు చెల్లించలసి వచ్చేది. కానీ ఇక నుండి క్రెడిట్ కార్డు వినియోగంపై వ్యాలెట్ టాపప్ చేసుకుంటే చాలు ఛార్జ్ వర్తిస్తుంది. క్రెడిట్ కార్డు ద్వారా నగదును జత చేసుకుంటే రెండు శాతం నామినల్ ఛార్జీ ఉంటుందని, మీ బ్యాంకు/పేమెంట్ నెట్ వర్క్‌కు అధిక ఛార్జీలను తాము అధిక ఛార్జీలను చెల్లించవలసి వస్తోందని పేర్కొంది.

మరో ఆసియా అద్భుతం: చైనా కంటే తక్కువ వేతనం.. దూసుకెళ్తున్న ఆ దేశంమరో ఆసియా అద్భుతం: చైనా కంటే తక్కువ వేతనం.. దూసుకెళ్తున్న ఆ దేశం

ఇలా జత చేసుకుంటే..

ఇలా జత చేసుకుంటే..

అయితే ఉచితంగా మీ వ్యాలెట్లకు నగదును పంపించుకోవడానికి యూపీఐ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించాలని పేటీఎం తమ కస్టమర్లకు ఓ సందేశాన్ని పంపించింది. నెట్ బ్యాంకింగ్ కూడా ఉపయోగించవచ్చునని తెలిపింది. బ్యాంకులు, క్రెడిట్ కార్డు కంపెనీలు పేటీఎం వ్యాలెట్‌లోకి డబ్బులు జత చేసేందుకు ఫీజును వసూలు చేస్తున్నాయని, కాబట్టి క్రెడిట్ కార్డు వినియోగదారులు అలా జత చేస్తే రెండు శాతం ఛార్జ్ విధించబడుతుందని తెలిపింది. కాగా, క్రెడిట్ కార్డు ద్వారా కనీసం రూ.50 చొప్పున రూ.200 వరకు నగదు జత చేస్తే రెండు శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చునని కూడా పేర్కొంది.

పండుగ సమయంలో ఆఫర్

పండుగ సమయంలో ఆఫర్

ప్రస్తుతం పండుగ సీజన్ నేపథ్యంలో వివిధ కంపెనీలు తమ ఉత్పత్తులపై ఆపర్లు ఇస్తున్నాయి. ఇటీవలి వరకు కరోనా కారణంగా సేల్స్ పడిపోయాయి. ఈ పండుగను క్యాష్ చేసుకోవాలని అన్ని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేటీఎం కూడా వ్యాలెట్ నుండి బ్యాంకు అకౌంట్‌కు మనీ ట్రాన్సుఫర్ చేస్తే విధించే 5 శాతం ఛార్జీని తాత్కాలికంగా మాఫీ చేసినట్లు పేటీఎం ప్రతినిధులు వెల్లడించారు. తమ వ్యాలెట్‌లోని మొత్తాన్ని మరొక వ్యాలెట్ లేదా బ్యాంకు ఖాతాకు బదలీ చేయడానికి, ఆన్‌లైన్ ద్వారా క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు జరపడానికి, బిల్లు చెల్లింపుల ప్రాసెస్ కోసం, రీఛార్జీల కోసం ట్రాన్సాక్షన్స్ ఉచితంగా లభిస్తాయని పేర్కొన్నారు.

2017లో ప్రారంభించి.. వెనక్కి

2017లో ప్రారంభించి.. వెనక్కి

పేటీఎం 2017 నుండి క్రెడిట్ కార్డుల ద్వారా వ్యాలెట్‌లోకి డబ్బును జత చేస్తే ఛార్జీ వసూలు చేస్తోంది. కానీ కస్టమర్ల ఒత్తిడి నేపథ్యంలో ఆ తర్వాత దానిని వెనక్కి తీసుకుంది. అయితే ఇప్పుడు మరోసారి దానిపై ఛార్జీ వసూలు చేస్తోంది. వడ్డీలేని క్రెడిట్ కార్డు మనీని దుర్వినియోగం చేయకుండా, అనవసరపు ట్రాన్సాక్షన్స్‌ను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

English summary

ఆ 'క్రెడిట్'పై 2% ఛార్జీ వసూలు చేయనున్న పేటీఎం.. ఎందుకంటే | Paytm top up via credit card attracts 2 percent fee

Paytm users will have to pay a 2 per cent fee on the amount added to their e-wallet using a credit card.
Story first published: Sunday, October 18, 2020, 13:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X