For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్, ఏప్రిల్ 2022 నుండి మొబైల్ వ్యాలెట్లు, ప్రీపెయిడ్ కార్డ్స్ మార్చుకోవచ్చు

|

2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం (ఏప్రిల్ 2022) నుండి మొబైల్ వ్యాలెట్ మార్చుకునే వెసులుబాటును కల్పిస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI). అదే ఫోన్ నెంబర్‌తో టెలికం కంపెనీలను మార్చుకునే పోర్టబులిటీకి అవకాశం ఉన్న విషయం తెలిసిందే. అంతకుముందు టెలికం కంపెనీ మారాలంటే ఫోన్ నెంబర్ మార్చాల్సిందే. కానీ ఫోన్ నెంబర్ మార్చకుండానే మనం ఇప్పుడు టెల్కోలను మార్చుకోవచ్చు. అలాగే మొబైల్ వ్యాలెట్లను కూడా మార్చుకునే అవకాశం త్వరలో వస్తోంది.

మరికొద్ది రోజుల్లో ఇంట్లోనే కరోనా టెస్ట్, ఇలా చేసుకోవచ్చుమరికొద్ది రోజుల్లో ఇంట్లోనే కరోనా టెస్ట్, ఇలా చేసుకోవచ్చు

ఆర్బీఐ సర్క్యులర్

ఆర్బీఐ సర్క్యులర్

పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే, ఇతర మొబైల్ వ్యాలెట్లను మార్చుకునే వెసులుబాటుకు సంబంధించి ఆర్బీఐ స‌ర్క్యుల‌ర్ జారీ చేసింది. దీని ప్రకారం 2022 నాటికి ఈ మార్పులు అమల్లోకి రావాలి. పేటీఎం, ఫోన్‌పే, మొబిక్విక్, గూగుల్ పే వంటి మొబైల్ వాలెట్లు వంటి అన్ని లైసెన్స్ పొందిన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (PPIs) 2022తో ఇంటరాపెరాబుల్ అవుతాయి. కేటీసీ నిబంధ‌న‌లు పొందుప‌రిచిన వారు వివిధ మొబైల్ వాలెట్ల నుండి డ‌బ్బు పంపించుకోవడం, స్వీక‌రించ‌డం చేయవచ్చు.

నగదు ఉపసంహరణ

నగదు ఉపసంహరణ

మొబైల్ వాలెట్ల నుండి ప్రస్తుతం రూ.2,000 వరకు నగదును ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంది. ఆర్బీఐ సర్క్యులర్ ప్రకారం ఈ వ్యాలెట్ పరిమితిని రూ.1 లక్ష నుండి రూ.2 లక్షలకు పెంచారు. ఏప్రిల్ ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ దీనిని ప్రకటించారు.

వ్యాలెట్ లేదా ప్రీపెయిడ్ కార్డు

వ్యాలెట్ లేదా ప్రీపెయిడ్ కార్డు

స్వచ్చంధ ప్రాతిపదికన ఇంటరాపెరబిలిటీని అమలు కోసం పూర్తి KYC-PPIకి సంబంధించి ఆర్బీఐ ఇంతకుముందు 2018 అక్టోబర్‌లో మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పుడు ఈ కొత్త నిబంధనలతో ఏటీఎం, మైక్రో ఏటీఎం, పాయింట్ ఆఫ్ సేల్(PoS) వద్ద నగదు ఉపసంహరించుకోవడానికి పేమెంట్ వ్యాలెట్ లేదా ప్రీపెయిడ్ కార్డును ఉపయోగించుకోవచ్చు.

English summary

గుడ్‌న్యూస్, ఏప్రిల్ 2022 నుండి మొబైల్ వ్యాలెట్లు, ప్రీపెయిడ్ కార్డ్స్ మార్చుకోవచ్చు | Paytm, PhonePe, Google Pay, other mobile wallets to be interoperable from April 2022

The Reserve Bank of India (RBI) has issued a circular asking all licensed prepaid payment instruments (PPIs) or mobile wallets such as PhonePe, Paytm, Google Pay and Mobikwik, to be interoperable from FY23.
Story first published: Friday, May 21, 2021, 8:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X