For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2.6 లక్షల మంది కస్టమర్లకు పేటీఎం రీఫండ్, ఎందుకంటే

|

2020 ఏడాదిలో హైవేలలో టోల్ ప్లాజాల ద్వారా 2.6 లక్షల మంది FASTag కస్టమర్ల నుండి తప్పుగా వసూలు చేసిన టోల్ చార్జీ రుసుమును రీఫండ్ చేయడానికి పేటీఎం తన వినియోగదారులకు సహాయపడినట్లు పేటీఎం పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్(PPBL) బుధవారం తెలిపింది. వాహనాన్ని తప్పుగా గుర్తించడం లేదా టోల్ ప్లాజాల ద్వారా పొరపాటుగా రెండుసార్లు చార్జీ తీసుకోవడం వంటి తప్పుడు వసూళ్లను తిరిగి వాహన యజమానులకు అందించేందుకు జరిపే చెల్లింపుల్ని సులభతరం చేసినట్లు వెల్లడించింది.

ఇందుకు పేటీఎం చెల్లింపుల సంస్థ వేగ‌వంత‌మైన ప‌రిష్కార యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఇది టోల్ ప్లాజా వద్ద జ‌రిగే త‌ప్పుడు చెల్లింపుల్ని గుర్తించి ప‌రిష్కారం చూపుతుంది. FASTag ద్వారా టోల్ ఛార్జీల ఆటోమేటిక్ చెల్లింపును నిర్దారించేట‌ప్పుడు కొన్నిసార్లు టోల్ ప్లాజాల‌ వ‌ద్ద ఉన్న సిస్ట‌మ్స్, ప్రాసెస్‌ల‌లో స‌మ‌స్య‌లు కార‌ణంగా అస‌లు ఛార్జీ కంటే ఎక్కువ వ‌సూలుకు కార‌ణ‌మ‌వుతున్నాయి.

Paytm Payments helps 2.6 lakh users get refund for wrong toll charges

ఇలాంటి క‌స్ట‌మ‌ర్ ఫిర్యాదులను త్వ‌రిత‌గ‌తిన పరిష్కరించేందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ త‌న‌ క‌స్ట‌మ‌ర్ల ఫిర్యాదులు, అనుబంధ టోల్ ట్రాన్సాక్షన్స్, టోల్ ప్లాజాలలో జ‌రిగే స‌మ‌స్య‌ల‌ను పూర్తిగా ఆడిట్ చేసే ఒక ఖ‌చ్చిత‌మైన వివాదాల్ని నివారించే నిర్వ‌హ‌ణ ప్రక్రియ‌ను అందుబాటులోకి తెచ్చింది.

English summary

2.6 లక్షల మంది కస్టమర్లకు పేటీఎం రీఫండ్, ఎందుకంటే | Paytm Payments helps 2.6 lakh users get refund for wrong toll charges

Paytm Payments Bank Ltd (PPBL) on Wednesday announced that it has facilitated refunds for 2.6 lakh FASTag users who were charged incorrectly by toll plazas in the year 2020. Paytm Payments has set up a fast redressal mechanism, which identifies incorrect deductions and immediately raises claims to reverse the extra charges.
Story first published: Wednesday, February 24, 2021, 22:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X