For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గూగుల్‌కు షాక్, పేటీఎం సరికొత్త యాప్ స్టోర్: ప్లేస్టోర్ పేమెంట్ రూల్ గడువు పెంపు

|

గూగుల్‌కు పోటీగా పేటీఎం రంగంలోకి దిగింది. దేశీయ యాప్ డెవలపర్ల కోసం ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ మినీ యాప్ స్టోర్‌ను సోమవారం ప్రారంభించింది. గూగుల్ ప్లేస్టోర్ నుండి ఇటీవల కొన్ని గంటల పాటు పేటీఎం యాప్‌ను తొలగించిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం ఇటీవల పేటీఎం బాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. గూగుల్‌కు పోటీగా వస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. తాజాగా పేటీఎం సొంతగా యాప్ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ యాప్ స్టోర్‌ను మొబైల్‌లో డౌన్ లోడ్ చేసుకోకుండానే ఉపయోగించుకోవచ్చు. నేరుగా మొబైల్ వెబ్ సైట్ ద్వారా యాప్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. దీంతో దేశీయ మొబైల్ యూజర్లకు డేటా ప్రైవసీకి ముప్పు ఉండదని స్పష్టం చేసింది. తక్కువ ఖర్చుతో హెచ్‌టీఎంఎల్, జావా స్క్రిప్ట్ ఆధారంగా డెవలప్ చేసిన యాప్స్‌కు కూడా తమ ప్లేస్టోర్లలో చోటు ఉంటుందని పేటీఎం తెలిపింది.

జపాన్ స్టాక్ మార్కెట్లో హార్డ్‌వేర్ సమస్య, 6 ట్రిలియన్ డాలర్ల ప్రభావంజపాన్ స్టాక్ మార్కెట్లో హార్డ్‌వేర్ సమస్య, 6 ట్రిలియన్ డాలర్ల ప్రభావం

పేటీఎం మినీ యాప్ స్టోర్ ప్రత్యేకత

పేటీఎం మినీ యాప్ స్టోర్ ప్రత్యేకత

డిజిటల్ చెల్లింపుల వేదిక పేటీఎం భారతీయ డెవలపర్ల కోసం ఈ యాప్‌ను తీసుకు వచ్చింది. ఈ యాప్‌ను ఫోన్లో ఇన్‌స్టాల్ చేసుకోకుండా పేటీఎం మినీ యాప్ స్టోర్ నుండి నేరుగా మొబైల్ వెబ్ సైట్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. యాప్‌లలో అంతర్గతంగా మినీ యాప్స్ లిస్టింగ్ కోసం ఎలాంటి ఛార్జీలు వసూలు చేయమని తెలిపింది. అలాగే యూజర్లు పేటీఎం వ్యాలెట్, పేటీఎం పేమెంట్స్ బ్యాంకు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్స్ వంటి వాటి ద్వారా చెల్లింపులు జరిపేలా డెవలరప్లు ప్రత్యామ్నాయ అవకాశాలు ఇవ్వవచ్చునని తెలిపింది. కేవలం క్రెడిట్ కార్డు చెల్లింపులపై 2 శాతం చార్జీ ఉంటుందని తెలిపింది.

300కు పైగా యాప్స్

300కు పైగా యాప్స్

పేటీఎం మినీ యాప్ స్టోర్‌లో 300కు పైగా యాప్స్ చేరనున్నాయి. ఇందులో డెకథ్లాన్, 1ఎంజీ, నెట్‌మెడ్స్, డిజిట్, ఓలా, పార్క్‌+, రాపిడో, పిజ్జా, ఫ్రెష్‌మెన్, నోబ్రోకర్ వంటి 300 సంస్థలు తమ ప్లేస్టోర్ కోసం యాప్స్‌ను డెవలప్‌ చేశాయని పేటీఎం తెలిపింది. మన దేశానికి చెందిన ప్రతి యాప్ డెవలపర్‌కు అవకాశం కల్పించడంలో భాగంగానే ఈ మినీ యాప్ స్టోర్ ప్రారంభించినట్లు పేటీఎం వ్యవస్థాపకులు విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. పేటీఎం వినియోగదారులకు కొత్త అనుభూతి కలిగిస్తుందన్నారు. ప్రస్తుతం ఈ యాప్‌స్టోర్ బీటా వెర్షన్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు తెలిపారు. పేటీఎం యూజర్స్ ప్రత్యేకంగా ఆయా యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని, తమకు నచ్చిన పేమెంట్ ఆప్షన్స్ ద్వారా చెల్లింపులు చేసే వీలు ఉందని తెలిపారు. పరిమిత స్థాయిలో డేటా, ఫోన్ మెమరీ గల యూజర్లకు ఇలాంటి మినీ యాప్స్ ఉపయోగకరమన్నారు.

చెల్లింపులు..

చెల్లింపులు..

గూగుల్ ప్లేస్టోర్‌ను వినియోగించుకునే యాప్స్‌లో చెల్లింపులకు సంబంధించిన సేవలు, ట్రాన్సాక్షన్స్ ఉంటే అందులో 30 శాతం కమీషన్‌గా గూగుల్ ప్లేస్టోర్‌కు చెల్లించాలనే నిబంధన ఉంది. తమ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ ప్లేస్టోర్ నుండి పేటీఎంతో పాటు 18 యాప్స్‌ను గూగుల్ తొలగించింది. దీంతో వివాదం ప్రారంభమై, పేటీఎం మినీ యాప్ స్టోర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

టెక్నాలజీ ఆధారిత ఆర్థిక సేవల విభాగంలో గూగుల్‌తో పేటీఎం పోటీగా ఉంది. క్యాష్ బ్యాక్ ఆఫర్‌తో నిబంధనలకు విరుద్ధంగా క్రీడ బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడుతోందని గత నెల 18న పేటీఎం యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుండి తొలగించింది. కొన్ని గంటల తర్వాత మళ్లీ చేర్చింది. మార్కెట్ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, పోటీ సంస్థలను అణగదొక్కేందుకు గూగుల్ ఇలా చేస్తోందని పేటీఎం ఆరోపించింది.

గూగుల్ గడువు పెంపు

గూగుల్ గడువు పెంపు

ఇదిలా ఉండగా, గూగుల్ ప్లేస్టోర్‌లో నమోదైన యాప్స్ తప్పనిసరిగా తమ బిల్లింగ్ సిస్టంనే వినియోగించాలని గూగుల్ గతంలో ప్రకటించింది. ఇన్-యాప్స్ కొనుగోళ్లకు సంబంధించి నిర్దిష్ట ఫీజును చెల్లించాలని తెలిపింది. అయితే డెవలపర్లు అభ్యంతరాలు వ్యక్తం చేయడం, నిరసనల నేపథ్యంలో భారత డెవలపర్లు ప్లేబిల్లింగ్ సిస్టంతో తమ యాప్స్‌ను అనుసంధానించేందుకు గడువును 2022 మార్చి 31 వరకు పొడిగించింది.

English summary

గూగుల్‌కు షాక్, పేటీఎం సరికొత్త యాప్ స్టోర్: ప్లేస్టోర్ పేమెంట్ రూల్ గడువు పెంపు | Paytm launches its own Android mini app store

Paytm Mini App Store has been launched within the digital payments app, the company announced on Monday.
Story first published: Tuesday, October 6, 2020, 7:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X