For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pawan Hans sold out: లక్కీ ఛాన్స్ కొట్టిన ఆ కన్సార్టియం

|

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి సర్కార్.. తన ప్రైవేటీకరణ ప్రక్రియను మరింత ముమ్మరం చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఎయిరిండియాను అమ్మేసిన కేంద్రం- ఇక పవన్ హన్స్‌ కార్పొరేషన్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేసింది. దీన్ని విక్రయించేసింది. స్టార్9 మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలోని కన్సార్టియం ఈ కార్పొరేషన్‌ను కొనుగోలు చేసింది.

Reliance Jio IPO: ఆ రెండింటి నుంచి రూ.లక్ష కోట్లకు పైగా సేకరణ: అంబానీ కీలక ప్రకటనReliance Jio IPO: ఆ రెండింటి నుంచి రూ.లక్ష కోట్లకు పైగా సేకరణ: అంబానీ కీలక ప్రకటన

పవన్ హన్స్ కార్పొరేషన్- కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. కేంద్ర ప్రభుత్వానికి 51, ఓఎన్జీసీకి 49 శాతం మేర ఇందులో వాటాలు ఉన్నాయి. ప్రస్తుతం 42 హెలికాప్టర్లను నడిపిస్తోంది. ఎక్కువగా ఓఎన్జీసీ దీని సేవలను వినియోగించుకుంటుంటుంది. నష్టాలొస్తున్నాయనే పేరుతో దీన్ని ప్రైవేట్‌పరం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ కార్పొరేషన్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంది. దీనికోసం చాలాకాలం నుంచి ప్రయత్నాలు సాగిస్తోన్నప్పటికీ.. అవి ఫలించలేదు.

Pawan Hans privatisation: consortium led by Star9 Mobility emerges highest bidder, says govt sources

మూడుసార్లు డిజిన్వెస్ట్‌మెంట్‌ను ప్రకటించినప్పటికీ.. ఈ కార్పొరేషన్‌ను కొనుగోలు చేయడానికి ఏ సంస్థ కూడా ముందుకు రాలేదు. ఫలితంగా వాల్యును తగ్గించింది కేంద్రం. వాల్యూను తగ్గించడంతో స్టార్9 మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలోని కన్సార్టియం దీన్ని కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. బిడ్డింగ్స్‌ను దాఖలు చేసింది. బిగ్ ఛార్టర్ ప్రైవేట్ లిమిటెడ్, మహారాజా ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్, అల్మాస్ గ్లోబల్ అపార్చునిటీ ఫండ్స్ ఎస్‌పీసీ‌ సంస్థలు ఈ కాన్సార్టియంలో ఉన్నాయి.

ఈ కన్సార్టియం 211.14 కోట్ల రూపాయలకు బిడ్డింగ్స్ దాఖలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. 181.05 కోట్ల రూపాయలు, 153.15 కోట్ల రూపాయలతో మిగిలిన బిడ్డింగ్స్‌ దాఖలయ్యాయి. ఫ్లై బిగ్ ఎయిర్‌లైన్స్ పేరుతో బిగ్ ఛార్టర్ ప్రైవేట్ లిమిటెడ్ తన సేవలను అందిస్తోంది. ఉడాన్ మార్గాల్లో వీటిని నడిపిస్తోంది. ముంబై కేంద్రంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తోందీ కంపెనీ. ఢిల్లీకి చెందిన సంస్థ మహారాజా ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్. కేమాన్ ఐలండ్స్‌కు చెందిన ఏవియేషన్ కంపెనీ అల్మాస్ గ్లోబల్ అపార్చునిటీ ఫండ్.

English summary

Pawan Hans sold out: లక్కీ ఛాన్స్ కొట్టిన ఆ కన్సార్టియం | Pawan Hans privatisation: consortium led by Star9 Mobility emerges highest bidder, says govt sources

Government on Friday said that it has approved the highest bid of Star9 Mobility Pvt Ltd for sale of its stake of 51 per cent in Pawan Hans Limited for Rs 211.14 crore.
Story first published: Saturday, April 30, 2022, 14:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X