For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వంటింట్లో నూనెల సెగ... ధరలు మండిపోనున్నాయ్.... కారణం ఏమిటంటే?

|

నూనె లేకుండా రోజు గడుస్తుందా.. నూనెవాడకుండా రుచికరమైన వంట తయారవుతుందా.. సువాసన వచ్చే కూరలు, కరకరలాడిందే వేపుల్లకు నూనెలు తప్పని సరి. భోజన ప్రియులు పెరుగుతున్న కొద్దీ నూనెల వాడకం పెరిగి పోతోంది. ఇదేస్థాయిలో ధరలు కూడా పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ వాడకం మాత్రం తగ్గడం లేదు. నూనెలో వినియోగించే పామాయిల్ మనదేశంలో తక్కువగా ఉత్పత్తి అవుతోంది.

దీన్ని విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అయితే ఈ పామాయిల్ ధర రానున్న కొద్దీ కాలంలోనే పెరిగే సంకేతాలు వెలువడుతున్నాయి. ఒకవేళ దీని ధర పెరిగితే నూనెల ధర కూడా పెరిగే అవకాలు ఉంటాయి అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

బ్రోకర్లు దుకాణం సర్దేస్తే... పరిస్థితి ఏంటి? ఏం చేయాలి?బ్రోకర్లు దుకాణం సర్దేస్తే... పరిస్థితి ఏంటి? ఏం చేయాలి?

కారణం ఏమిటంటే?

కారణం ఏమిటంటే?

ప్రపంచంలో అత్యధికంగా పామాయిల్ ను ఇండోనేషియా, మలేషియా దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే ఈ దేశాలు తమ బయో డీజిల్ లో పామాయిల్ వినియోగాన్ని పెంచాలను కుంటున్నాయి. ఇండోనేషియా 20 శాతం నుంచి 30 శాతానికి, మలేషియా 10 శాతం నుంచి 20 శాతానికి పెంచాలనుకున్నాయి. ఈ స్థాయిలో పెంచితే ఆ మేరకు పామాయిల్ సప్లై తగ్గిపోయి అవకాశాలు ఏర్పడనున్నాయి.

మన దేశంలో అత్యధికంగా పామాయిల్ ను వినియోగిస్తున్నాము. పల్లి నూనె, పొద్దు తిరుగుగుడు పువ్వు నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ ను ఎక్కువగా వినియోగిస్తున్నాము. వీటిలోని పామాయిల్ ను కొంత మేరకు కలుపుతున్నారు. పూర్తిగా పామాయిల్ ను కూడా వంటకాల్లో వాడుతున్నారు. ఇప్పుడు ఇండోనేషియా, మలేసియా నుంచి దిగుమతులు తగ్గినా, లభ్యత తగ్గిన వచ్చే రెండు మూడు నెలల్లో పామాయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

ఇప్పటికే పెరిగిన ధరలు

ఇప్పటికే పెరిగిన ధరలు

దేశీయ మార్కెట్లో ధరలు ఇప్పటికే పావు శాతం పెరిగి నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వర్షాలు కురిసిన కారణంగా పామాయిల్ పంట దెబ్బ తిన్నదని, ఇది ధరల పెరుగుదలకు దారి తీసిందని అంటున్నారు. చైనాలో నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని ఆ దేశ కొనుగోళ్లు పెరిగాయని , ఫలితంగా ధరలు పెరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ఎంత పెరగవచ్చంటే?

ఎంత పెరగవచ్చంటే?

పామాయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో టన్నుకు 50 డాలర్ల వరకు పెరగవచ్చంటున్నారు. ఒకవేళ ఇదేజరిగితే పామాయిల్ ధర 8 శాతం వరకు పెరగవచ్చంటున్నారు.

ఉత్పత్తి ఎంతంటే?

ఉత్పత్తి ఎంతంటే?

ఇండోనేషియా వార్షికంగా 4 కోట్ల టన్నులు, మలేసియా 1.9 కోట్ల టన్నుల పామాయిల్ ను ఉత్పత్తి చేస్తోంది. ఈ రెండు దేశాల నుంచి భారత్ 90 లక్షల టన్నుల పామాయిల్ ను దిగుమతి చేసుకుంటోంది. వంట నూనెల వినియోగంలో 70 శాతం దిగుమతులపై ఆధార పడాల్సి వస్తోంది. దీంతో పాటు సోయాబీన్, సంఫ్లవర్ ఆయిల్ ను కూడా ఎక్కువగానే దిగుమతి చేసుకుంటోంది.

English summary

వంటింట్లో నూనెల సెగ... ధరలు మండిపోనున్నాయ్.... కారణం ఏమిటంటే? | palmoil prices set to increase?

Prices of palmoil set set rise in few months as palmoil producing countries are going to increase the usage of palmoil in biodiesel.
Story first published: Wednesday, November 27, 2019, 15:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X