For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏడాది కనిష్టానికి పామాయిల్ ధరలు, పుంజుకున్న ఈ కంపెనీల షేర్లు

|

వంటనూనె ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మలేషియన్ పామాయిల్ ఫ్యూచర్స్ బుధవారం ఒక్కరోజే 8 శాతం క్షీణించి, ఏడాది కనిష్టానికి పడిపోయింది. మాంద్యం భయాల కారణంగా సరఫరా ఇబ్బందులు తలెత్తవచ్చుననే ఆందోళనలు కూడా ఉన్నాయి. బుర్సా మలేషియా డెరివేటివ్స్ ఎక్స్చేంజ్‌లో బెంచ్ మార్క్ పామ్ ఆయిల్ కాంట్రాక్ట్ (సెప్టెంబర్) డెలివరీ 348 రిగ్గిట్స్ లేదా 8.34 శాతం క్షీణించి 3426 రిగ్గిట్స్‌కు పడిపోయింది. ఇది డాలర్ వ్యాల్యూలో 774.76 డాలర్లు. పామ్ వరుసగా నాలుగో సెషన్‌లో భారీగా నష్టపోయింది. జూలై 9, 2021 తర్వాత ఇదే కనిష్టం.

ముడి పామాయిల్ ధరలు పడిపోవడంతో మన వద్ద కొన్ని స్టాక్స్ పైన ప్రభావం పడుతోంది. హిందూస్తాన్ యూనీలీవర్, బ్రిటానియా, గోద్రేజ్ కన్స్యూమర్స్ పెరిగాయి. గ్లోబల్ క్రూడ్ ధరలు పడిపోవడంతో HUL, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్ షేర్లు నేడు (జూలై 6, 2022) పుంజుకున్నాయి. ఇండోనేషియా నుండి ఎగుమతులు పునఃప్రారంభం కావడంతో ప్రపంచ డిమాండ్ పైన ఆందోళనలతో అంతర్జాతీయ ఎక్స్చేంజీల్లో ముడి పామాయిల్ ఫ్యూచర్ గత కొద్ది వారాల్లోనే 35 శాతానికి పైగా తగ్గాయి. ప్రస్తుతం పామాయిల్ ధరలు ప్రస్తుతం ఆరు నెలల కనిష్టస్థాయికి చేరుకున్నాయి.

Palm oil slumps over 8% to near one year low, These consumer rise

క్రూడ్ పామాయిల్ ధరలు గణనీయంగా తగ్గడం దేశీయ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ తయారీదారులకు సానుకూలంగా ఖనిపిస్తోంది. ఇది కీలకమైన ముడి పదార్థం. కరోనా, ఆ తర్వాత రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పామాయిల్ ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.

Read more about: oil godrej britannia hul నూనె
English summary

ఏడాది కనిష్టానికి పామాయిల్ ధరలు, పుంజుకున్న ఈ కంపెనీల షేర్లు | Palm oil slumps over 8% to near one year low, These consumer rise

Malaysian palm oil futures plunged more than 8% on Wednesday to a near one-year low, hit by anticipation of rising supplies amid a sell-off in crude and Dalian oils driven by recession fears. The benchmark palm oil contract for September delivery on the Bursa Malaysia Derivatives Exchange fell 348 ringgit, or 8.34% to 3,426 ringgit ($774.76) a tonne by 0307 GMT.
Story first published: Wednesday, July 6, 2022, 12:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X