OYO IPO: ఐపీవోపై ఓయో పెద్ద అప్‌డేట్.. కొత్త నిర్ణయం ఇదే.. IPO ఎప్పుడు వస్తుందో తెలుసా?
OYO IPO: హాస్పిటాలిటీ రంగంలో సంచలనాలు సృష్టించిన ఓయో ఐపీవో కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. గతంలోనే మార్కెట్లోకి అడుగుపెట్టాల్సిన ఈ స్టార్టప్ పరిస్థితుల కారణంగా అప్పట్లో వాయిదా వేసుకుంది. అయితే ఈ క్రమంలో కంపెనీ పెద్ద అప్ డేట్ ప్రకటించింది.

సెబీకి కొత్త పత్రాలు..
OYO IPO విషయంలోహాస్పిటాలిటీ రంగం చాలా జాగ్రత్తగా ఉన్నట్లు కనిపిస్తోంది. స్టాక్-మార్కెట్‌లోకి ప్రవేశించే ముందు కంపెనీ తన ప్లాన్‌లను రీవర్క్ చేస్తోంది. ఈ క్రమంలో కంపెనీ పనితీరు మెరుగుపడటం వల్ల నష్టాలు కూడా తగ్గాయి. దీంతో కంపెనీ తాజాగా సెబీ వద్ద సవరించిన ఫైనాన్స్ పత్రాలను దాఖలు చేసింది.

ఓయో ఐపీవో ఎప్పుడంటే..
కంపెనీ IPOను వచ్చే ఏడాది మెుదట్లో.. అంటే 2023 జనవరిలో ప్రారంభించాలని యోచిస్తోంది. మార్కెట్ల పనితీరుకు అనుగుణంగా నిర్ణయం ఉంటుందని కంపెనీ చెబుతోంది. అసలు కంపెనీ 2021లో ఐపీవోగా రావాలని సెబీ వద్ద తొలుత పత్రాలను దాఖలు చేసింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా హోటల్ పరిశ్రమ ఆర్థిక పరిస్థితి బాగా లేనందున లిస్టింగ్ ప్లాన్ నిలిపివేసింది. ఆ సమయంలో ఓయో భారీ నష్టాలను చవిచూసింది. వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుతం కంపెనీ నష్టాలు తగ్గటంతో కంపెనీ తన తాజా నిర్ణయాన్ని వెల్లడించింది.

ఇతర దేశాల్లో వ్యాపారం..
స్టార్టప్ ఇప్పుడు నాలుగు ప్రధాన ప్రాంతాలపై దృష్టి సారిస్తోంది. భారతd, మలేషియా, ఇండోనేషియా, యూరప్, ఇక్కడ వెకేషన్ హోమ్‌లను నిర్వహిస్తోంది. ఇది ఇంతకుముందు కీలకమైన యూఎస్, చైనా వంటి మార్కెట్లలో కార్యకలాపాలను తగ్గించింది. ఇక్కడ దాని ఉద్యోగులు ఇప్పుడు సింగిల్ డిజిట్‌లో ఉన్నారు.
ఒడిదుడుకుల తర్వాత విజయవంతమైన IPOని ల్యాండ్ చేయడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది. గుర్గావ్ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్‌లో జపాన్ కు చెందిన సాఫ్ట్ బ్యాంక్ దాదాపు 47% వాటాలు ఉన్నాయి. ఇదే క్రమంలో 28 ఏళ్ల అగర్వాల్‌కు కంపెనీలో దాదాపు మూడో వంతు వాటా ఉంది.