For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Billionaires: రోజుకు 1.50 లక్షల శాలరీ.. 21 ఏళ్ల వయస్సులో విజయం.. వ్యాపారంతో దేశంలో రికార్డు

|

OYO & Zepto: దేశంలో యువ సంపన్నుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మేము పాతతరం వ్యాపారుల్లా కాదంటూ.. వేగంగా వ్యాపారాలను వృద్ధిలోకి తీసుకొస్తున్నారు. అలా అనతి కాలంలోనే సంపన్నులుగా మారిపోతున్నారు.

ఓయో..

ఓయో..

ఓయో కంపెనీ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రితేష్ అగర్వాల్ జీతం 2021-22లో పరిహారం 250% పెరిగి రూ.5.6 కోట్లకు చేరుకుంది. ఈ లెక్కన ఆయన రోజుకు ఏకంగా రూ.1.53 లక్షలు సంపాదిస్తున్నారు. హాస్పిటాలిటీ రంగంలో సంచలనంగా మారిన ఓయోను 21 ఏళ్ల వయస్సులో ముందుకు నడిపిస్తున్నారు. సీఈవో స్థానంలో కంపెనీని విజయవంతంగా అభివృద్ధి చేస్తున్నారు. ESOPలు గత సంవత్సరంతో పోలిస్తే ఫోకస్ కింద ఆర్థిక సంవత్సరంలో 323% నుంచి రూ.647 కోట్లకు పెరిగాయని చూపుతున్నాయి. మార్చి 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రితేష్ జీతం రూ.1.6 కోట్లుగా ఉంది.

 ఐపీవో ప్రణాళికలు..

ఐపీవో ప్రణాళికలు..

కంపెనీ తన ఐపీవోను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా నేనందున కంపెనీ తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చింది. అయితే తాజాగా విడుదలైన ఫలితాల్లో కంపెనీ నష్టాలు తగ్గటంతో ఈ ఐపీవో రావటానికి మరికొంత కాలం పడుతుందని తెలుస్తోంది. ఐపీవో ద్వారా కంపెనీ రూ.8,430 కోట్లను సమీకరించడం కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబికి డిఆర్‌హెచ్‌పిని దాఖలు చేసింది.

 19 ఏళ్ల బిలియనీర్..

19 ఏళ్ల బిలియనీర్..

ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 వివరాల ప్రకారం 19 ఏళ్ల పిన్న వయస్కుడైన Kaivalya Vohra నిలిచాడు. దేశంలో గ్రాసరీ డెలివరీలో సంచలనాలు సృష్టిస్తున్న జెప్టో సంస్థకు ఇతను సహవ్యవస్థాపకుడిగా ఉన్నాడు. ప్రస్తుతం అతని సంపద రూ.1,000 కోట్లుగా ఉంది. స్టాన్ఫోడ్ విశ్వవిద్యాలయం డ్రాపవుట్ గా ఉన్న ఇతను నిర్వహిస్తున్న వ్యాపారం రిలయన్స్ వంటి దిగ్గజ కంపెనీలకు సైతం నిద్ర లేకుండా చేస్తోంది. కేవలం 10 నిమిషాల్లో డెలివరీ అంటూ వ్యాపారంలో పెను మార్పులకు తెరతీశారు. అలా సంపన్నుల జాబితాలో 1,036వ స్థానంలో ఉన్నాడు.

మరో సంపన్న యువకుడు..

మరో సంపన్న యువకుడు..

ఇదే క్రమంలో Zepto కంపెనీలో మరో సహవ్యవస్థాపకుడిగా ఉన్న అదిత్ పల్తాలీ రూ.1200 కోట్ల సంపదతో ధనవంతుల జాబితాలో 950వ స్థానంలో నిలిచారు. గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి 200 మిలియన్ డాలర్ల నిధులను సేకరించిన తర్వాత జెప్టో భారత్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-గ్రోసరీ కంపెనీగా కొనసాగుతోంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 900 మిలియన్ డాలర్లుగా ఉంది.

English summary

Billionaires: రోజుకు 1.50 లక్షల శాలరీ.. 21 ఏళ్ల వయస్సులో విజయం.. వ్యాపారంతో దేశంలో రికార్డు | oyo founder earning high salary amid zepto founders stood as young richest club know details

oyo founder earining high salary amid zepto founders stood as young richest club know details
Story first published: Thursday, September 22, 2022, 14:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X