For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిసెంబర్ 26 నాటికి 4 కోట్ల మందికి పైగా ఐటీ రిటర్న్స్ దాఖలు

|

డిసెంబర్ 26 నాటికి 4.15 కోట్ల మంది ట్యాక్స్‌పేయర్స్ ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేశారు. 2020-21 (FY2019-20) సంవత్సరానికి గాను ఐటీ రిటర్న్స్ దాఖలుకు డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు ఉంది. అయితే శనివారం వరకు నాలుగుకోట్ల మందికి పైగా రిటర్న్స్ దాఖలు చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ డిపార్టుమెంట్ ఆదివారం తెలిపింది. ఐటీ రిటర్న్స్ వెంటనే ఫైల్ చేయాలని కూడా సూచించింది. 2.34 కోట్ల మంది ఐటీఆర్-1, 89.89 లక్షలమంది ఐటీఆర్-4, 49.72 లక్షల మంది ఐటీఆర్-3, 30.36 లక్షలమంది ఐటీఆర్-2 దాఖలు చేశారు.

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ సమీపించింది. మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు మరింత సులభతర ఐటీఆర్ ఫైలింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది ఆదాయపన్ను శాఖ. ఈ మేరకు జాట్‌పట్ ప్రాసెసింగ్ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్స్ ఇబ్బంది లేకుండా త్వరితగతిన దాఖలు చేయడంలో ఇది సాయపడుతుంది.

ఫామ్ 16 లేకుండా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు, ఇవి గుర్తుంచుకోండి..ఫామ్ 16 లేకుండా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు, ఇవి గుర్తుంచుకోండి..

Over 4.15 crore ITRs for fiscal year 2019-20 filed till December 26

ITR-1, ITR-4 కోసం జాట్‌పట్ ప్రాసెసింగ్ ప్రారంభమైంది. జాట్‌పట్ ప్రాసెసింగ్ ద్వారా ఐటీఆర్ 1, ఐటీఆర్ 4ను ఎలా దాఖలు చేయాలో వివరించే ట్యూటోరియల్ వీడియోను ఆదాయ పన్ను శాఖ యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. ఐటీ శాఖ విభాగం నిర్దేశించిన ప్రమాణాలను నెరవేర్చిన వారు మాత్రమే దీనిని యాక్సెస్ చేయవచ్చు.

English summary

డిసెంబర్ 26 నాటికి 4 కోట్ల మందికి పైగా ఐటీ రిటర్న్స్ దాఖలు | Over 4.15 crore ITRs for fiscal year 2019-20 filed till December 26

Over 4.15 crore taxpayers have already filed their income tax returns (ITR) for assessment year 2020-21 (FY2019-20) till December 26, the Income Tax Department said on Sunday.
Story first published: Monday, December 28, 2020, 17:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X