బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పరుగులు పెడుతున్నాయి. గత నెలలో రూ.45 వేల రికార్డ్ క్రాస్ చేసిన పసిడి ఓ సమయంలో రూ.40వేల దిగువకు చేరుకుంది. ఆ తర్వాత మళ్లీ క్రమంగా పెరుగుతూ రూ.44వేలు దాటింది. తిరిగి రికార్డ్ హైధరకు చేరువలోకి వచ్చింది. అంతర్జాతీయ పరిస్థితులపై బంగారం ధరలు మారుతుంటాయి.

రికార్డ్ ధరకు చేరువలో బంగారం ధర
కరోనా మహమ్మారి నేపథ్యంలో బంగారం ధరలు ఊగిసలాటలో ఉన్నాయి. ఓ సమయంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించి ఇన్వెస్ట్ చేస్తుండటంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి. మరో సమయంలో కొంతమంది చేతిలో కరెన్సీ కోసం వంటి వివిధ కారణాలతో అమ్మకాలకు దిగుతున్నారు. ఇలాంటి సమయంలో పడిపోతోంది. ఇటీవల బంగారం ధర వరుసగా పెరుగుతోంది. రికార్డ్ ధరకు చేరువవుతోంది.

హైదరాబాద్‌లో ఎంత?
ఉదాహరణకు హైదరాబాద్‌లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.44,030గా ఉంది. నిన్నటి కంటే స్వల్పంగా అంటే రూ.10 పెరిగింది. 22 క్యారెట్ల పసిడి కూడా రు.40,020 నుండి రూ.10 పెరిగి రూ.40,030గా ఉంది.

రూ.200 పెరుగుదల
హైదరాబాద్‌లో గత పది రోజుల్లో ధర భారీగానే పెరిగింది. మార్చి 27న రూ.41,770గా ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర 28వ తేదీ నాటికి రూ.38,828గా ఉంది. ఆ తర్వాత ఏప్రిల్ 1న రూ.39,440కి చేరుకొని, ఇప్పుడు రూ.40,030 పలికింది. 28వ తేదీ తర్వాత రూ.200 వరకు పెరిగింది.

రూ.650 పెరుగుదల.. నాటితో భారీగా పెరిగిన ధర
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్చి 27న రూ.45,300గా ఉంది. మార్చి 28న రూ.2,000 వరకు పడిపోయి రూ.43,375 పలికింది. ఏప్రిల్ 1న రూ.43,160 పలికిన బంగారం ఈ రోజు రూ.44,030గా ఉంది. మార్చి 28వ తేదీతో పోలిస్తే రూ.650 వరకు పెరిగింది. దాదాపు విజయవాడలోను ఇదే విధంగా పెరిగింది. వెండి ధరలు కూడా పెరిగాయి. గత నెలలోని రికార్డ్ తగ్గుదల (రూ.40,000 దిగువన)తో పోలిస్తే భారీగానే పెరిగినట్లు. ఏకంగా రూ.4,000కు పైగా పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధర
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం బ్యారెల్‌కు 0.04 శాతం పెరిగి1645 డాలర్లుగా ఉంది. గత నెలలో 1470 నుండి తిరిగి ఇప్పుడు భారీగా పెరిగింది. వెండి ధర కూడా ఔన్స్ 0.28 శాతం పెరిగి 14.52 డాలర్లకు చేరుకుంది. ఢిల్లీలోను 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెల్లరీ మార్కెట్, భౌగోళిక యుద్ధాలు, ద్రవ్యోల్భణంవంటివి వాటిపై బంగారం ధర ఆధారపడి ఉంది.
More From GoodReturns

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు



Click it and Unblock the Notifications