For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ భారీగా పెరిగింది: సీబీడీటీ చైర్మన్

|

2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రిటర్న్స్ సంఖ్య భారీగా పెరిగిందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ సంగీతా సింగ్ తెలిపారు. 2020-21లో 6.9 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలైతే గత ఆర్థిక సంవత్సరంలో 7.14 కోట్లకు పెరిగాయన్నారు.

ప్రాథమిక ట్యాక్స్ పేయర్స్, రివైజ్డ్ రిటర్న్స్ దాఖలు చేసే వారి సంఖ్య కూడా పెరిగినట్లు తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలు పంజుకుంటున్నాయనేందుకు ఇది నిదర్శనం అన్నారు. ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతున్నందున పన్ను వసూళ్లు కూడా పెరుగుతాయని తెలిపారు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌తో పాటు వస్తు, సేవల క్రయవిక్రయాలు పెరుగుతాయన్నారు.

 Number of IT returns rising: CBDT chairman

FY22లో ట్యాక్స్ కలెక్షన్లు మొత్తం రూ.14 లక్షల కోట్లు నమోదయ్యాయని, FY20తో పోలిస్తే ఇది చాలా బాగుందని తెలిపారు. డిజిటల్ ఇండియా నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు, ఇన్షియేటివ్ మేరకు పన్ను చెల్లింపుల్లో వృద్ధి రేటు చూడవచ్చునని సంగీతా సింగ్ తెలిపారు. కరోనా సమయంలో ప్రజల డిజిటల్ చెల్లింపులు పెరిగాయన్నారు.

English summary

ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ భారీగా పెరిగింది: సీబీడీటీ చైర్మన్ | Number of IT returns rising: CBDT chairman

The number of Income Tax returns has increased in FY22 over the previous fiscal, Central Board of Direct Taxes chairman Sangeeta Singh said today.
Story first published: Sunday, June 12, 2022, 9:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X