For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Chitra Ramakrishna: గూఢచర్యం కేసులో చిత్ర రామకృష్ణ అరెస్ట్.. ఈడీ అధికారుల విచారణ..

|

Chitra Ramakrishna: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మాజీ ఎండీ చిత్రా రామకృష్ణన్‌ అరెస్ట్‌ అయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చిత్రను అరెస్టు చేసింది. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్, ఎక్స్ఛేంజ్ ఉద్యోగులపై గూఢచర్యానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ కోర్టు అనుమతి మేరకు రామకృష్ణన్‌ను విచారణ నిమిత్తం ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చిత్రను నాలుగు రోజుల పాటు కస్టడీలో విచారించేందుకు ప్రత్యేక న్యాయమూర్తి సునైనా శర్మ ఈడీకి అనుమతిచ్చారు.

జైలు నుంచి కోర్టుకు..
గతంలో న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్‌ఎస్‌ఈ మాజీ మేనేజింగ్ డైరెక్టర్‌ను జైలు నుంచి కోర్టులో హాజరుపరిచారు. ఈడీ పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయమూర్తి రామకృష్ణన్‌పై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కింద 'ప్రొడక్షన్ వారెంట్' జారీ చేశారు.

 nse former md chitra ramakrishna was arrested by ed for enquiry in phone tapping case

9 రోజుల కస్టడీ కోరగా..
రామకృష్ణను కోర్టులో హాజరుపరిచిన తరువాత.. ఈడీ అధికారులు చిత్రను విచారించడానికి కోర్టు నుంచి అనుమతి తీసుకుంది. తరువాత.. డైరెక్టరేట్ సహకరించనందుకు గాను రామకృష్ణను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచి.. మరో తొమ్మిది రోజుల కస్టడీని కోరింది. అయితే.. కోర్డు నాలుగు రోజుల కస్టడీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీని అనుమతించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) వేరే కేసులో అరెస్టు చేయగా.. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

English summary

Chitra Ramakrishna: గూఢచర్యం కేసులో చిత్ర రామకృష్ణ అరెస్ట్.. ఈడీ అధికారుల విచారణ.. | nse former md chitra ramakrishna was arrested by ed for enquiry in phone tapping case

nse former md chitra ramakrishna was arrested by ed
Story first published: Thursday, July 14, 2022, 20:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X