న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య, ఆహారం అత్యవసరం. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అత్యవసర ఆహారాన్ని సరఫరా చేస్తోంది. మిగతా వాటిని ప్రస్తుతానికి నిలిపివేసింది. ఫ్లిప్‌కార్ట్ అన్ని సేవలు నిలిపివేసింది. కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాల ఆదేశాల నేపథ్యంలో కొన్నిచోట్ల ఎసెన్షియల్ ఐటమ్స్ సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ డెలివరీ
అమెజాన్, బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్, స్విగ్గీ, జొమాటో తదితర ఈ-కామర్స్ ద్వారా ఫుడ్ డెలివరీ చేసేందుకు ఢిల్లీ పోలీసులు, గురుగ్రామ్ పోలీసులు, నోయిడా పోలీసులు, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్.. డెలివరీ బాయ్స్‌కు కర్ఫ్యూ పాస్‌లు ఇవ్వడం ద్వారా డెలివరీలను అనుమతిస్తున్నాయి. అయితే కొన్ని చోట్ల అత్యవసర వస్తువులను అనుమతించకపోవడంపై MHA ఆందోళన వ్యక్తం చేస్తోంది. బిగ్ బజార్ (చైన్) వంటి ఆఫ్‌లైన్ రిటైల్ సంస్థలు.. తమ డెలివరీ బాయ్స్ బైక్స్ నిలిపివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

అత్యవసర వస్తువులు పంపిణీ..
వివిధ నగరాల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రామాణిక ఆపరేటింగ్ ప్రోటోకాల్ రూపొందించేందుకు, హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలకు MHA సూచించింది. అవసరమైన వస్తువుల పంపిణీ సమన్వయం కోసం నోడల్ అధికారులను నియమించాలని పేర్కొంది. రైల్వే సరుకు రవాణాతో సంబంధం ఉన్న ట్రక్ డ్రైవర్లు, లేబర్‌ను పోలీసులు అడ్డుకొని, చేయి చేసుకున్నట్లుగా వార్తలు వచ్చిన అంశాన్ని కూడా కేంద్రం పరిశీలించింది. వీటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

రైల్వే సరుకులు మినహాయింపు కేటగిరీ
మార్చి 25 లాక్ డౌన్ మొదటి రోజు. అత్యవసర వస్తువులైన ఆహార పదార్థాల (పాలు, పప్పులు తదితర పదార్థాలు) కోసం ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. వివిధ ప్రదేశాల్లో లోడ్, అన్ లోడ్ చేసేందుకు లేబర్ అవసరం. లేబర్ అందుబాటులో లేకపోవడం వల్ల రవాణా మూడో వంతుకు మందగించింది. మంగళవారం 45,000 వ్యాగన్ల సరఫరా ఉండగా, బుధవారం ఇది 32,000కు పడిపోయింది. ఈ నేపథ్యంలో రైల్వే కార్మికుల ఇష్యూను పరిష్కరించేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం రైల్వే సరుకును మినహాయింపు కేటగిరీ జాబితాలో చేర్చింది.

ఫ్లిప్‌కార్ట్ ఏం చెప్పిందంటే
బిగ్ బాస్కెట్ వంటి ఆన్ లైన్ కిరాణా అవసర సేవలకు కేంద్ర అధికారుల అనుమతి ఉన్నప్పటికీ స్థానిక అధికారుల ఆంక్షల వల్లసేవలు నిలిపివేయాల్సి వచ్చింది. తమ డెలివరీ ఎగ్జిక్యూటివ్ల ఆరోగ్య భద్రత కోసం తాము సేవలు నిలిపివేసినట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ లాక్ డౌన్ సమయంలో తమ కస్టమర్లు ఇంట్లోనే ఉంటారని, వారి అవసరాలు తీర్చేందుకు స్థానిక పోలీసులు, ప్రభుత్వాల సహకారం కోరుతున్నట్లు కూడా తెలిపింది.

సరఫరాలో ఇబ్బందులు
సరఫరా సమయంలో తమ డెలివరీ బాయ్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి భద్రత కూడా తమకు ముఖ్యమని ముంబై, పుణే, ఢిల్లీ, హైదరాబాద్‌లలో సేవలు అందించే ఆన్ లైన్ డెలివరీ కంపెనీ సూపర్ డైలీ పేర్కొంది. కాబట్టి తాము సేవలు నిలిపివేశామని తెలిపింది.

చక్కెర రవాణాకు సరిహద్దుల్లో అడ్డు
యూపీలోని ఓ ట్రాన్సుపోర్ట్ ఏజెన్సీకి చెందిన వ్యక్తి మాట్లాడుతూ.. చక్కెర రవాణాకు తమకు ఇక్కడ అనుమతివ్వగా, వాహనాలు సరిహద్దుల్లో చిక్కుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీ ట్రక్కులు తిరిగి వచ్చే టప్పుడు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అసత్య ప్రచారాలకు దూరం
ఎసెన్షియల్ కమోడిటీపై ఎలాంటి అసత్య ప్రచారాలు చేయవద్దని MHA రాష్ట్రాలకు సూచించింది. తగినంత ఆహారం, వైద్య, పౌర సామాగ్రి అందుబాటులో ఉందని, అవసరమైన సేవలు, అత్యవసర వస్తువులు ఉన్నాయని ప్రజలకు తెలియజేయాలని సూచించింది. అలాగే, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందిని ఇంటి యజమానులు ఇబ్బంది పెట్టవద్దని హెచ్చరించింది. డాక్టర్లను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.

మెడిసిన్స్ సరఫరా
మేజర్ రిటైలర్లు, వాణిజ్య సంఘాలు బుధవారం కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి పరిస్థితి గురించి వివరించారు. ఆయా ప్రాంతాల్లోని స్థానిక నిబంధనలు ఇబ్బందికి గురి చేస్తున్నట్లు వెల్లడించారు. వివిధ ఈ కామర్స్, రిటైలర్స్ సేవలు నిలిపివేసిన సమయంలో తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. మరోవైపు, లాక్ డౌన్ నేపథ్యంలో మెడిసిన్స్ కొరతను కూడా దృష్టిలో పెట్టుకోవాలని కేంద్రానికి వైద్య వర్గాలు సూచించాయి. వీటి సరఫరాలో అంతరాయం ఉండవద్దని కోరాయి. ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దాలని, ఇలాగే ఉంటే కొన్ని రోజుల తర్వాత మెడిసిన్ కొరత ఏర్పడే ప్రమాదముందని చెబుతున్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications