For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.5, రూ.10, రూ.100 నోట్ల రద్దు: RBI ఏం చెప్పిందంటే?

|

పాత రూ.5, రూ.10, రూ.100 నోట్లని వెనక్కి తీసుకోనుందనే వార్తలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) సోమవారం స్పందించింది. దేశంలోని పలు పాత కరెన్సీ నోట్లను రద్దు చేస్తామనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. దేశంలో పాత రూ.5, రూ.10, రూ.100 చలామణిలో ఉంటాయని తెలిపింది. ఈ మూడు రకాల పాత నోట్లను భవిష్యత్తులో కూడా ఉపసంహరించుకోమని తేల్చి చెప్పింది. ఈ అంశంపై గత కొద్ది రోజులుగా జోరుగా చర్చ సాగుతోన్న విషయం తెలిసిందే.

సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?

తేల్చి చెప్పిన ఆర్బీఐ

తేల్చి చెప్పిన ఆర్బీఐ

2016 నవంబర్ నెలలో కేంద్రం రూ.1000, రూ.500 పాత నోట్లు రద్దు చేసింది.అయితే రూ.రూ.5, రూ.10, రూ.100 నోట్లను మాత్రం కొనసాగిస్తోంది. అదే సమయంలో రూ.10 నుండి రూ.2వేల మధ్య కొత్తనోట్లు, నాణేలు ముద్రిస్తోంది.

దీంతో పాత నోట్లను ఆర్బీఐ రద్దు చేస్తుందని, ఈ మేరకు నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగా పాత రూ.100, రూ.10, రూ.5 నోట్లను మార్చడం లేదంటే లేదంటే వాటిని పూర్తిగా ఉపసంహరించుకోవడం జరగనుందని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఆర్బీఐ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

అదంతా వట్టిదే

అదంతా వట్టిదే

పాత రూ.5, రూ.10, రూ.100 నోట్లని భారతీయ రిజర్వ్ బ్యాంక్ వెనక్కి తీసుకోనుందని ఇటీవల నెట్టింట, వాట్సాప్ వంటి వాటిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఏప్రిల్ నాటికి వీటి చలామణిని పూర్తిగా నిలిపివేయాలని ఆర్బీఐ నిర్ణయించిందని సోషల్ మీడియాలో వార్తలు షికారు చేశాయి. ఇప్పటికే చాలా రోజులుగా రూ.10 కాయిన్ తీసుకోవడానికి చాలామంది వెనుకాడుతున్నారు.

ప్రస్తుతం ఈ వార్తల నేపథ్యంలో రూ.5, రూ.10, రూ.100 నోట్లు తీసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా, ఇతర ఇంటర్నెట్ ప్లాట్‌ఫాంలలో వైరల్ అవుతోన్న నకిలీ వార్తలను మోడీ ప్రభుత్వం నేతృత్వంలోని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ బృందం బయటపెట్టింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ప్రకారం... 2021 మార్చి తర్వాత రూ.5, రూ.10, రూ.100 డినామినేషన్ నోట్లు చెల్లవని ఆర్బీఐ సమాచారం ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ సమాచారం తప్పు అని తేల్చి చెప్పింది.

ఇలాంటివి నమ్మవద్దు

ఇలాంటివి నమ్మవద్దు

పాత రూ.100, రూ.10, రూ.5 నోట్లు చలామణిలో ఉండబోవనే వార్తలను కొట్టిపారేయడంతో పాటు ఈ నోట్లకు సంబంధించి ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచన చేస్తున్నారు. గతంలోను ఇలాంటి ప్రచారాలు పలుమార్లు జరిగాయి. రూ.2000 నోట్లు మరోసారి రద్దు చేస్తారని కూడా అప్పట్లో ప్రచారం సాగింది.

English summary

రూ.5, రూ.10, రూ.100 నోట్ల రద్దు: RBI ఏం చెప్పిందంటే? | No Plans of Withdrawing Old RS 100 Notes: RBI

The Reserve Bank of India has denied reports that old currency notes will become invalid from March this year. The central bank clarified in a twitter statement that media reports on withdrawal of old series of banknotes of ₹ 5, ₹ 10 and ₹ 100 from circulation were incorrect.
Story first published: Monday, January 25, 2021, 18:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X