Ban On Petrol: 5 ఏళ్ల తరువాత దేశంలో నో పెట్రోల్..! నితిన్ గడ్కరీ షాకింక్ కామెంట్స్.. రైతులకు లాభాలు..
Ban On Petrol: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. దీనిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయోజనాలను అందిస్తోంది. కేవలం తయారీ సంస్థలకు మాత్రమే కాకుండా వినియోగదారులకు సైతం అనేక రూపాల్లో తగ్గింపు అందుబాటులో ఉన్నాయి. రానున్న ఐదేళ్లలో పెట్రోల్ వినియోగంలో ఉండదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దేశంలో శిలాజ ఇంధనాన్ని నిషేధించనున్నట్లు ఆయన వెల్లడించారు.
केंद्रीय मंत्री श्री @nitin_gadkari जी का अकोला - शेगांव प्रवास तथा उनका 'डॉक्टर ऑफ साइंस' सम्मान समारोह pic.twitter.com/TCcVvxMmoh
— Office Of Nitin Gadkari (@OfficeOfNG) July 7, 2022
అందుబాటులోకి గ్రీన్ హైడ్రోజన్..
మరో పక్క గ్రీన్ హైడ్రోజన్, బయో ఫ్యూయల్ వంటి వాటిలో రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే ప్రయోగాలు ముమ్మరం చేశాయి. కాగా.. వచ్చే ఐదేళ్లలో దేశంలో పెట్రోలు వినియోగంలో ఉండదని కేంద్ర రోడ్డు రవాణా&రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ షాకింగ్ కామెంట్స్ చేశారు. మహారాష్ట్రలోని విదర్భ జిల్లాలో తయారవుతున్న బయో-ఇథనాల్‌ను వాహనాల్లో వినియోగిస్తున్నారని గడ్కరీని ఉటంకిస్తూ మీడియాలో కథనాలు వచ్చాయి. లోతైన బావి నీటితో గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసి కిలో రూ.70కి విక్రయించవచ్చు. రాబోయే ఐదేళ్లలో దేశంలో పెట్రోల్ అయిపోతుందని, దీని కారణంగా దేశంలో శిలాజ ఇంధనాన్ని నిషేధించనున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

రైతులకు లాభాల పంట..
రైతులు కేవలం ఆహార ప్రదాతలే కాకుండా ఇంధన ప్రదాతలుగా మారాల్సిన అవసరాన్ని కూడా గడ్కరీ ప్రస్తావించారు. గోధుమలు, వరి, మొక్కజొన్నలు వేయడం వల్ల ఏ రైతు భవిష్యత్తును మార్చుకోలేరని అన్నారు. గడ్కరీ గురువారం మహారాష్ట్రలోని అకోలాలో డాక్టర్ పంజాబ్రావ్ దేశ్‌ముఖ్ కృషి విద్యాపీఠ్ నుంచి గౌరవ డాక్టరేట్ ఆఫ్ సైన్స్ (DSc) డిగ్రీని పొందారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.యూనివర్సిటీ 36వ స్నాతకోత్సవ వేడుకలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల గవర్నర్, ఛాన్సలర్ భగత్ సింగ్ కోష్యారీతో పాటు ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.