For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Success Story: ఉద్యోగం వదిలి 'టీ' షాపు నిర్వహిస్తున్న లేడీ.. నెలకు రూ.50 వేలు సంపాదన.. ఎక్కడంటే..

|

Chai Wali Story: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన పని చేస్తున్నారా అనే ప్రశ్నకు సమాదానం ఖచ్చితంగా కాదనే చెప్పుకోవాలి. చాలా మంది కుటుంబ పరిస్థితి, పేదరికం, ఆర్థిక అవసరం వంటి అనేక అంశాల మధ్య పనిచేస్తున్నారు. ముఖ్యంగా స్వయం ఉపాధి పొందుతున్న వారు ఈ కారణంగా తమ ఉద్యోగాలను వదులుకున్నారు. కానీ.. రాజ్‌కోట్‌కు చెందిన ఈ అమ్మాయి విజయ గాథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సొంత వ్యాపారం కోసం..

సొంత వ్యాపారం కోసం..

నిషా హుస్సేన్(28) కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం వదిలేసి ప్రస్తుతం తనకు ఇష్టమైన పని చేస్తోంది. 2015లో ఉన్నత విద్యను పూర్తి చేసిన తర్వాత నిషా రాజ్‌కోట్ సబ్ రిజిస్ట్రార్‌లో సిస్టమ్ ఆపరేటర్‌గా పనిచేసింది. టీ వ్యాపారంలో నైపుణ్యాలను నేర్చుకునేందుకు ఓ హోటల్‌లో పని చేసింది. సైలెంట్ పేరుతో తన సొంత బ్రాండ్‌ను ప్రారంభించింది. ప్రసిద్ధ తందూరి టీతో సహా 10 రకాల టీలను విక్రయిస్తోంది. ఆమె చేస్తున్నది చిన్నపనే అయినప్పటికీ మంచి డబ్బును సంపాదిస్తోంది.

 ముద్దుపేరు రాజ్‌కోట్ చాయ్‌వాలీ..

ముద్దుపేరు రాజ్‌కోట్ చాయ్‌వాలీ..

చాలా కుటుంబాల్లో ఎప్పటిలాగే ఉద్యోగం మానేసి సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు వ్యతిరేకత ఎదురవుతుంది. ఆమె విషయంలోనూ అదే జరిగింది. అయినా వారిని ఒప్పించి తనకు ఇష్టమైన పని చేయడం మొదలుపెట్టింది. మొదట్లో తన టీ సేల్‌ను రహస్యంగా ప్రారంభించిన ఆమెను ఇప్పుడు రాజ్‌కోట్ ప్రజలు ముద్దుగా రాజ్‌కోట్ చాయ్‌వాలీ అని పిలుస్తారు. మెుదట్లో చాలా మంది ఓ మహిళ ఒంటరిగా.. నడుపుతుండడాన్ని చూసి భయపడ్డారు. దీని వల్ల 15 రోజులు కస్టమర్లు లేక టీ పారబోయాల్సి వచ్చింది.

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రజాదరణ..

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రజాదరణ..

ఒకరోజు ఒక కస్టమర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆమె షాప్ గురించి పోస్ట్ చేశాడు. అక్కడి నుంచి ఆమె వ్యాపారం పెరగడం మొదలైంది. అలా పాపులర్ కావటంతో చాలా మంది ఆమె దుకాణానికి వచ్చేవారు. రాజ్‌కోట్‌ ప్రజలు ప్రస్తుతం తనను చాయ్‌వాలీ అని పిలవటంపై చాలా సంతోషం వ్యక్తం చేస్తోంది.

 ఒక్కో టీ ధర రూ.40.. రకరకాల టీలు..

ఒక్కో టీ ధర రూ.40.. రకరకాల టీలు..

సాధారణంగా ఒక కప్పు సాదా టీ 10 రూపాయలు ఉంటుంది. కానీ.. రకరకాల రుచుల్లో టీ ధర 30 రూపాయలు. అదే పాపులర్ టీ ధర 40 రూపాయలుగా ఉంది. ఈమె తయారు చేసే తందూరీ టీ రెసిపీ మిమ్మల్ని ఒక్కసారైనా ట్రై చేయాలని అనిపించేలా చేస్తుంది. బ్లాక్ టీ, గ్రీన్ టీ, అల్లం టీ, యాలకుల టీ, లెమన్ టీ, మసాలా టీ, దాల్చిన చెక్క టీ ఇలా అనేక రుచుల్లో తేనీరు ప్రియులకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

రోజుకు రూ.3 వేలు ఆదాయం..

రోజుకు రూ.3 వేలు ఆదాయం..

మొదట్లో ఇంట్లో చెప్పకుండా ఈ దుకాణాన్ని తెరిచింది. స్నేహితుల ప్రోత్సాహంతో ప్రారంభించాలని భావించినప్పటికీ.. వారికీ వ్యాపారం గురించి ఏమీ తెలియదు. అందుకే ఆమె ఒక రెస్టారెంట్‌లో టీ మేకింగ్ ఉద్యోగం చేసింది. ప్రస్తుతం రోజూ ఉదయం 7.30 గంటలకు షాప్ తెరుస్తానని, రోజుకు రూ.3వేలు ఆదాయం వస్తోందని చెప్పింది. త్వరలోనే భారీగా ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు తెలిపింది. గతేడాది ప్రతినెలా 50,000 రూపాయల వరకు సంపాదించానని, కానీ కరోనా వల్ల నష్టపోయినట్లు నిషా హుస్సేన్ చెప్పింది. వ్యాపారాన్ని మళ్లీ మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది.

English summary

Success Story: ఉద్యోగం వదిలి 'టీ' షాపు నిర్వహిస్తున్న లేడీ.. నెలకు రూ.50 వేలు సంపాదన.. ఎక్కడంటే.. | Nisha Hussain quit job as systems engineer and started tea shop know her story

Nisha Hussain quit job as systems engineer and started tea shop became famous in instagram earned 50,000 a month in rajkot..
Story first published: Monday, July 18, 2022, 16:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X