For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 337 పాయింట్లు పతనం

|

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం రోజంతా ఊగిసలాట మధ్య కదలాడి, చివరకు భారీ నష్టాల్లో ముగిశాయి. సూచీలు ఒకటి రెండుసార్లు కాస్త కోలుకున్నట్లుగా కనిపించినప్పటికీ, అది కాసేపు మాత్రమే. అది మినహా రోజంతా నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. నేడు మొత్తం 32 కంపెనీలు నాలుగో క్వార్టర్ ఫలితాలను ప్రకటిస్తున్నాయి. ఇందులో జీ ఎంటర్‌టైన్మెంట్‌, బాష్, హావెల్స్ ఇండియా, HPCL, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ తదితర కంపెనీలు ఉన్నాయి. అలాగే, ఈ వారంలో మొదటి రెండు రోజులు భారీ లాభాలు నమోదు చేయడంతో వరుసగా రెండో రోజు ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది.

సూచీలు భారీగా డౌన్

సూచీలు భారీగా డౌన్

సెన్సెక్స్ 49,971.52 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,099.17 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,496.78 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 337.78 (0.68%) పాయింట్లు నష్టపోయి 49,564.86 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 15,042.60 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,069.80పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,884.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

నిఫ్టీ చివరకు 124.10 (0.83%) పాయింట్లు నష్టపోయి 14,906.05 పాయింట్ల వద్ద ముగిసింది. నిన్న నష్టపోయినప్పటికీ 15000 వేల పాయింట్లకు పైనే ముగిసిన నిఫ్టీ నేడు మాత్రం ఈ మార్కును నిలుపుకోలేకపోయింది. ఇక సెన్సెక్స్ 49,600 పాయింట్ల దిగువకు పడిపోయింది.

టాప్ లూజర్స్, గెయినర్స్

టాప్ లూజర్స్, గెయినర్స్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా 2.35 శాతం, సిప్లా 2.24 శాతం, బీపీసీఎల్ 1.87 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 0.88 శాతం, టైటాన్ కంపెనీ 0.67 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో టాటా స్టీల్ 5.08 శాతం, హిండాల్కో 4.49 శాతం, కోల్ ఇండియా 3.42 శాతం, బ్రిటానియా 3.16 శాతం, ఓఎన్జీసీ 2.70 శాతం నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, హిండాల్కో ఉన్నాయి.

రంగాలవారీగా...

రంగాలవారీగా...

నిఫ్టీ 50 స్టాక్స్ 0.83 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.29 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 0.04 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.04 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.79 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.93 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.73 శాతం, నిఫ్టీ ఐటీ 0.34 శాతం, నిఫ్టీ మీడియా 0.24 శాతం, నిఫ్టీ మెటల్ 3.21 శాతం, నిఫ్టీ ఫార్మా 0.22 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.99 శాతం నష్టపోయాయి.

నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.36 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.02 శాతం మాత్రం లాభపడ్డాయి.

English summary

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 337 పాయింట్లు పతనం | Nifty ends below 15K, Sensex falls 337 points: metals underperform

Among sectors, except PSU Bank all other sectoral indices ended in the red with Nifty metal index down over 3 percent.
Story first published: Thursday, May 20, 2021, 16:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X