ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (24 నవంబర్) భారీ లాభాల్లో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డును తాకాయి. ఉదయం గం.9.18 సమయానికి సెన్సెక్స్ 274.67 పాయింట్లు( 0.62%) ఎగిసి 44,351.82 పాయింట్ల వద్ద, నిఫ్టీ 83.50 పాయింట్లు(0.65%) లాభపడి 13,010 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ తొలిసారి 13,000 మార్కును క్రాస్ చేసింది.
ఉదయం గం.11 సమయానికి సెన్సెక్స్ 320 పాయింట్లు లాభాపడి 44,400 వద్ద ట్రేడ్ అయింది. ఓ సమయంలో 44,458ని తాకింది. 1032 షేర్లు లాభాల్లో, 277 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 53 షేర్లలో ఎలాంటి మార్పులేదు. అన్ని రంగాలు కూడా లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

40 నెలల్లో 10వేల నుండి 13వేలకు నిఫ్టీ
నిఫ్టీ మొదటిసారి 13,000 మార్కును క్రాస్ చేసింది. 10,000 నుండి 13,000 మార్క్ చేరడానికి 40 నెలలు పట్టింది. జూలై 25, 2017న 10,000 మార్కు చేరుకున్న నిఫ్టీ ఆ తర్వాత 6 నెలలకు అంటే జనవరి 23, 2018న 11,000 పాయింట్లకు చేరుకుంది. 16 నెలల తర్వాత అంటే మే 23, 2019న 12,000ను తాకింది. ఇప్పుడు (నవంబర్ 24, 2020) 18 నెలల తర్వాత 13,000ను తాకింది. కరోనా మహమ్మారి లేకుంటే ఇంకా ముందుగానే ఈ మార్కును తాకేది. కరోనా వల్ల ఆలస్యమైంది.

రిలయన్స్ మళ్లీ డౌన్
ఉదయం గం.11 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో అదాని పోర్ట్స్ 6.22 శాతం, ఐచర్ మోటార్స్ 3.41 శాతం, HDFC బ్యాంకు 2.83 శాతం, మారుతీ సుజుకీ 2.86 శాతం, యాక్సిస్ బ్యాంకు 2.56 శాతం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
HDFC లైఫ్ 1.18 శాతం, గెయిల్ 1.14 శాతం, జేఎస్‌డబ్ల్యు సీల్ 0.73 శాతం, శ్రీ సిమెంట్స్ 0.59 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 0.63 శాతం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ, ఇండస్ ఇండ్ బ్యాంకు ఉన్నాయి.
రిలయన్స్ స్టాక్ నేడు మళ్లీ పతనమైంది. 0.57 శాతం నష్టపోయి రూ.1940 వద్ద ట్రేడ్ అయింది.

రంగాలవారీగా...
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 1.72 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.96 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.42 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.72 శాతం, నిఫ్టీ ఐటీ 0.55 శాతం, నిఫ్టీ మీడియా 0.26 శాతం, నిఫ్టీ 0.15 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఎనర్జీ 0.09 శాతం, నిఫ్టీ ఫార్మా 0.22 శాతం నష్టపోయాయి.
ఐటీ స్టాక్స్ విషయానికి వస్తే టీసీఎస్ 0.39 శాతం, ఇన్ఫోసిస్ 0.26 శాతం నష్టపోయాయి.
హెచ్‌సీఎల్ టెక్ 0.42 శాతం, టెక్ మహీంద్ర 1.57 శాతం, విప్రో 0.74 శాతం, మైండ్ ట్రీ 1.30 శాతం, కోఫోర్జ్ 0.59 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications