For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు ఈ స్కిల్స్ ఉన్నాయా... అయితే మీ ఉద్యోగం సేఫ్!

|

ఇటీవల కాలంలో ఉద్యోగం దొరకటం ఒకెత్తు అయితే, దానిని నిలుపుకోవటం మరో ఎత్తు అవుతోంది. 15-16 ఏళ్ళు కష్టపడి చదివి, కంప్యూటర్ కోర్సులు నేర్చుకొని కొత్త జాబ్ సంపాదిస్తే... ఏడాది తిరగకుండానే పెర్ఫార్మన్స్ అప్రైసల్ పేరుతో కంపెనీలు హడావిడి చేస్తాయి. అదృష్టం బాగుంటే ఓకే ... లేదంటే ఏ బెంచీ మీదకు పంపేయటమో లేదా ఉద్యోగం పీకేయటమో జరుగుతోంది. ఇది కేవలం ఒక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగానికి మాత్రమే పరిమితం కాలేటం లేదు. అన్ని రంగాల్లోనూ దాదాపు ఇదే ట్రెండు నడుస్తోంది. కారణం ఏమిటంటే ప్రస్తుతం మనం డిజిటల్ ప్రపంచంలో బతుకుతున్నాం. ప్రతి రంగంలోనూ కంప్యూటర్ వాడకం పెరిగిపోయింది. టెక్నాలజీ అనుసంధానం ఎక్కువైంది. దీంతో మనకు కేవలం సంబంధిత రంగానికి చెందిన స్కిల్ ఉంటె సరిపోవటం లేదు. అంతకు మించిన రెండు, మూడు స్కిల్స్ లో ప్రావీణ్యం సంపాదించాల్సి వస్తోంది. ఏ ఉద్యోగం చేస్తున్నా... ఏ స్థాయిలో ఉన్నా నిత్య విద్యార్థిలా మన నైపుణ్యానికి మెరుగులు దిద్దుకోవాల్సిందే. లేదంటే ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలదొక్కువటం కష్టం. నేర్చుకునే స్వభావం ఉండి, కొన్ని రకాల అధునాతన టెక్నాలజీ స్కిల్స్ ఇప్పటికే మీకు వచ్చి ఉంటె... మీ ఉద్యోగం సేఫ్ అని నిపుణులు చెబుతున్నారు.

మేం మీతో పోటీ పడలేం.. గో బ్యాక్ జెఫ్ బెజోస్: అమెజాన్ సీఈవోమేం మీతో పోటీ పడలేం.. గో బ్యాక్ జెఫ్ బెజోస్: అమెజాన్ సీఈవో

ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్...

ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్...

ఈ మధ్య కాలంలో ఎవరి నోట విన్నా... ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటేడ్ రియాలిటీ, 3డి ప్రింటింగ్, బ్లాక్ చైన్ వంటి టెక్నాలజీల గురించే చెబుతున్నారు. ఈ స్కిల్స్ మీ సొంతమైతేనే భవిష్యత్ బాగుంటుందని చెబుతున్నారు. ఇండియా లో ఆర్థిక మందగమనం కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది ఉద్యోగుల ఇంక్రెమెంట్లు, ప్రమోషన్ల కు గీటు రాయి గా వీటినే పరిగణన లోకి తీసుకుంటున్నట్లు హెచ్ ఆర్ కన్సల్టెన్సీ లు చెబుతున్నాయి. ఒక ఉద్యోగిగా మీ పనితీరు నామ మాత్రంగా ఉన్నా... మీరు మెషిన్ లెర్నింగ్ లో ఎక్స్పర్ట్ అనుకోండి, మీ ఉద్యోగం సేఫ్. అదే సమయంలో ఇంక్రెమెంట్లు పెంచుతున్నారు. ఎందుకంటే, ఈ టెక్నాలజీ పై పనిచేసేందుకు ఎలాగూ కంపెనీ కొత్త వారిని నియమించుకోవాలి. దానికంటే కూడా మిమ్మల్నే కొంత ట్రైనింగ్ ఇచ్చి కొత్త ప్రోజెక్టుల కోసం వినియోగించవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి.

డేటా సైన్స్, బిగ్ డేటా అనలిటిక్స్...

డేటా సైన్స్, బిగ్ డేటా అనలిటిక్స్...

టెక్నాలజీ ఒకెత్తు అయితే... డేటా ఎనాలిసిస్ మరో ఎత్తు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డేటా నే రాజ్యమేలుతోంది. అందుబాటులో ఉన్న డేటా ను సరిగ్గా అనలైజ్ చేయగలిగితే కస్టమర్ల ను ఎలా ఆకట్టు కోవలో, వారు నిజంగా ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవటం ఈజీ అవుతుంది. అందుకే ఈ రెండు సాంకేతిక విభాగాల్లో నిపుణులు అయితే గనుక మీకు తిరుగు లేదు. రూ లక్షల్లో వేతనాలు ఆఫర్ చేయటమే కాదు, ఇంక్రెమెంట్లు, ప్రమోషన్ల కు కొదవే లేదు. ఎందుకంటే, మొత్తం పనిచేయగలిగే ఉద్యోగుల్లో ఇలాంటి సాంకేతిక నైపుణ్యం కలిగిన వారు 10% లోపే ఉన్నారు. అందుకే, వీరికి ఒక్క మన దేశంలోనే కాదు, విదేశాల్లోనూ డిమాండ్ అధికంగా ఉంది.

డిజిటల్ మార్కెటింగ్..

డిజిటల్ మార్కెటింగ్..

సోషల్ మీడియా మన జీవితాల్లోకి ప్రవేశించిన తర్వాత ... దాని ప్రభావం జనజీవనం పై అధికంగా కనిపిస్తోంది. కేవలం వ్యక్తిగత సమాచార మార్పిడికే పరిమితం కాకుండా కంపెనీలకు వినియోగదారులను రెడీ మేడ్ గా అందించే వేదికలుగా మారిపోయాయి. అందుకే మీకు డిజిటల్ మార్కెటింగ్ లో నైపుణ్యం ఉంటె... ఇతర ఉద్యోగుల కంటే అధిక వేతనం ఇచ్చేందుకు కంపెనీలు వెనుకాడటం లేదు. ఎందుకంటే కస్టమర్ల పల్స్ తెలుసుకుని, అందుకు అనుగుణంగా ప్రచారానికి తెరలేపాల్సి ఉంటోంది. ఎలాగైనా వారిని సోషల్ మీడియా ప్లాట్ఫారం నుంచి కంపెనీల వెబ్సైట్ల కు మళ్లించాల్సి ఉంటోంది. అందుకే ఈ స్కిల్ కూడా తప్పనిసరి అయిపోయింది. ఈ మధ్య కాలంలో సాధారణ మార్కెటింగ్ రంగంలో ఉన్న ఉద్యోగులను కచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యం కూడా ఉంటేనే ఉద్యోగంలో తీసుకుంటున్నారు. అదే సమయంలో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్ (ఎస్ఈఓ) వంటి టెక్నిక్స్ తెలుసుకోవాల్సి ఉంటోంది.

అధిక వేతనం, ఇంక్రెమెంట్లు...

అధిక వేతనం, ఇంక్రెమెంట్లు...

పైన పేర్కొన్న అధునాతన టెక్నాలజీ సంబంధిత విభాగాల్లో మీరు నిష్ణాతులు అయితే... కంపెనీలు అధిక వేతనాలను ఆఫర్ చేస్తున్నాయి. అదే సమయంలో ఇంక్రెమెంట్లు కూడా పెంచుతున్నాయి. ఇటీవల ఐటీ రంగంలోని ఉద్యోగులకు ఈ స్కిల్స్ పై పోటీలు నిర్వహించి మరీ ప్రమోషన్స్ ఇస్తున్నారు. ఉన్న ఉద్యోగంలోనే కొనసాగాలన్నా... వేరే ఉద్యోగం లోకి మారిపోవాలన్నా ఈ స్కిల్స్ లో ఎదో ఒకటి మీకు ఉంటే మీ పని సులువు అవుతుంది. లేదంటే, ఉన్న ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియక ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో.. మరెందుకు ఆలస్యం? కొత్త స్కిల్స్ నేర్చుకోండి. మీ బాస్ తో శభాష్ అనిపించుకోండి. అల్ ది బెస్ట్!

English summary

మీకు ఈ స్కిల్స్ ఉన్నాయా... అయితే మీ ఉద్యోగం సేఫ్! | New technology skills can protect your current job

New technology skills such as artificial intelligence, machine learning, internet of things, virtual reality, block chain etc. can protect your current job while help you to increase your increments. Companies are considering your data science, big data analytics and digital marketing skills to retain you as an employee and offering big pay cheques and promotions.
Story first published: Friday, January 17, 2020, 7:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X