For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేటి నుండి కీలక మార్పులు: కొత్త TDS రూల్ నుండి చెక్కు బుక్ మార్పుల వరకు...

|

ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కస్టమర్లకు నేటి నుండి షాకిస్తోంది. పరిమితికి మించి ట్రాన్సాక్షన్స్ పైన కస్టమర్లపై భారం పడనుంది. జూలై 1వ తేదీ నుండి ఈ ఛార్జీలు అమలులోకి వస్తాయి. జూలై 1వ తేదీ నుండి పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో ఎస్బీఐ మార్పులు, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర, బ్యాంకుల విలీనం నేపథ్యంలో ఐఫ్ఎస్‌సీ కోడ్స్ మార్పు, పాత చెక్కుల చెల్లుబాటు ముగింపు, టీడీఎస్ కొత్త రూల్స్ సహా పలు అంశాలు ఉన్నాయి.

సిండికేట్ బ్యాంకు IFSC కోడ్

సిండికేట్ బ్యాంకు IFSC కోడ్

సిండికేట్ బ్యాంకు IFSC కోడ్స్, చెక్కుబుక్కులు జూలై 1వ తేదీ నుండి (నేటి నుండి) చెల్లవు. సిండి కేట్ బ్యాంకు... కెనరా బ్యాంకులో విలీనమైంది. దీంతో నేటి నుండి సిండికేట్ బ్యాంకు ఖాతాదారులు కెనరా బ్యాంకుకు చెందిన కొత్త IFSC కోడ్స్ వినియోగించాలి. కెనరా బ్యాంకు వెబ్ సైట్ ద్వారా వీటిని పొందవచ్చు. 'సిండికేట్ బ్యాంకు కస్టమర్లకు విజ్ఞప్తి. థర్డ్ పార్టీకి ఇచ్చిన సిండికేట్ బ్యాంకు చెక్కులు 30-06-2021 వరకు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి' అని సిండికేట్ బ్యాంకు తెలిపింది.

చెక్కులు చెల్లవు

చెక్కులు చెల్లవు

ఆంధ్రాబ్యాంకు, కార్పోరేషన్ బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమయ్యాయి. దీంతో పాత చెక్కు బుక్కులు జూలై 1వ తేదీ నుండి చెల్లవు. కొత్త చెక్కుబుక్కుల యూనియన్ బ్యాంకు శాఖల్లో తీసుకోవాలి.

టీడీఎస్ నిబంధనలు

టీడీఎస్ నిబంధనలు

గత రెండు ఆర్థిక సంవత్సరాల ఆదాయానికి సంబంధించి టీడీఎస్, టీసీఎస్ రూ.50,000 మించి ఉన్నప్పటికీ ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయని వారి నుండి అధిక శాతంలో పన్ను వసూలు చేయాలని ఆదాయ పన్ను విభాగం నిర్ణయించింది. ఇది జులై 1 నుండి అమ‌ల్లోకి రానుంది.

ఎస్బీఐ మార్పులు..

ఎస్బీఐ మార్పులు..

ప్రాథమిక పొదుపు బ్యాంక్ డిపాజిట్ ఖాతా (BSBD) కలిగిన ఖాతాదారుల ట్రాన్సాక్షన్స్ పైన జులై 1వ తేదీ నుండి కొన్ని పరిమితులు విధించేందుకు ఎస్బీఐ సిద్ధమవుతోంది. ఈ అకౌంట్ ఉన్న వారు బ్యాంకు శాఖలు, ఏటీఎంల నుండి కూడా కలిపి నెలకు ఉచితంగా 4సార్లు మాత్రమే నగదు తీసుకునే వెసులుబాటు ఉంది. ఆ తర్వాత ఒక్కో ట్రాన్సాక్షన్ పైన రూ.15 (జీఎస్టీ అదనం) చొప్పున ఛార్జీ ఉంటుంది.

ఎల్పీజీ ధర..

ఎల్పీజీ ధర..

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు జులై 1వ తేదీ నుండి మారుతున్నాయ. ఎల్పీజీ సిలిండర్ ధరలను ప్రతి పదిహేను రోజులకు ఓసారి పెట్రోలియం కంపెనీలు సవరిస్తాయి. ఇందులో భాగంగా జులై 1వ తేదీన సిలిండర్ ధరలు మారుతాయి. కొద్దిరోజలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ ధరలు పెరిగే అవకాశముంది.

English summary

నేటి నుండి కీలక మార్పులు: కొత్త TDS రూల్ నుండి చెక్కు బుక్ మార్పుల వరకు... | New TDS rule to Cheque book charges: Personal Finance Changes From July 1

Every month as per the latest government announcement, there can be some changes that come into force and need to be known by the country's citizens for better financial planning.
Story first published: Thursday, July 1, 2021, 9:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X