For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చమురు ధరలు డౌన్, వచ్చే ఏడాది జనవరి వరకు ఉత్పత్తి కోత

|

అమెరికా, యూరోప్ దేశాల్లో కరోనా కేసులు పెరగడం, వివిధ దేశాలు మరోసారి లాక్‌డౌన్ దిశగా ఆలోచనలు చేస్తున్న నేపథ్యంలో చమురు ధరలు క్షీణించాయి. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో చమురు ధరలు పడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావడంతో చమురు ధరలు క్రమంగా పెరిగాయ. తాజాగా కరోనా రెండో దశ పలు దేశాలను భయానికి గురి చేస్తోంది. దీంతో జూన్ ప్రారంభం నుండి కనిష్టానికి పడిపోయాయి.

రోజుకు రూ.1 లక్ష: వివిధ డెబిట్ కార్డులపై SBI ఏటీఎం క్యాష్ ఉపసంహరణ పరిమితి...రోజుకు రూ.1 లక్ష: వివిధ డెబిట్ కార్డులపై SBI ఏటీఎం క్యాష్ ఉపసంహరణ పరిమితి...

వచ్చే ఏడాది ధరలు పుంజుకునే ఛాన్స్

వచ్చే ఏడాది ధరలు పుంజుకునే ఛాన్స్

అమెరికా క్రూడ్ ఫ్యూచర్ నిన్న ఓ సమయంలో 6.6 శాతం మేర క్షీణించింది. ఆ తర్వాత 3.3 శాతం క్షీణించి బ్యారెల్‌కు 36.17 డాలర్ల వద్ద ముగిసింది. జూన్ 1వ తేదీ నుండి ఇది కనిష్టం. 2020లో బ్యారెల్‌కు 60 డాలర్ల వద్ద ప్రారంభమైన ధర ఏప్రిల్ మాసంలో జీరో కంటే దిగువకు పడిపోయింది. కరోనా కేసుల కారణంగా క్రూడాయిల్ ధరలు 2021 రెండో అర్ధ సంవత్సరంలో తిరిగి పుంజుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రోన్ అక్టోబర్ 30వ తేదీ నుండి నేషనల్ లాక్ డౌన్ ప్రకటించారు. జర్మన్ ఛాన్సులర్ ఏంజిలా మెర్కెల్ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఒక నెల పాక్షిక లాక్ డౌన్ ప్రకటించారు. బ్రిటన్ లాక్ డౌన్ ప్రకటించింది.

మళ్లీ ఆ స్థాయికి...

మళ్లీ ఆ స్థాయికి...

కరోనా రెండో వేవ్ వణికిస్తుండటం ముడిచమురు ధరలు పతనమవుతున్నాయి. 2 రోజులుగా ముడిచమురు ఫ్యూచర్స్ ట్రేడర్స్ భారీ అమ్మకాలకు తెరదీశారని తెలుస్తోంది. దీంతో రెండు రోజుల క్రితం 5 శాతం పతనమైన బ్రెంట్, నైమెక్స్ చమురు ధరలు నిన్న అదే స్థాయిలో క్షీణించాయి. ఓ దశలో నైమెక్స్ బ్యారెల్ ​5.3 శాతం పతనమై 35.11 డాలర్లకు చేరడం నాలుగు నెలల కనిష్టం. బ్రెంట్ బ్యారెల్ సైతం 5 శాతం క్షీణించి 36 డాలర్లను తాకింది. బ్రెంట్ ధరలు ఈ ఏడాది మే నెలలో 37 డాలర్ల దిగువకు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ఆ స్థాయికి చేరాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ 3.96 శాతం క్షీణించి 35.91 డాలర్లు పలికింది.

ఉత్పత్తి కోత

ఉత్పత్తి కోత

అక్టోబర్ 23వ తేదీతో ముగిసిన వారంలో ఇంధన నిల్వలు అంచనాలకు మించి 4.3 మిలియన్ బ్యారెళ్లకు చేరినట్లు యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ (EIA) పేర్కొంది. యూఎస్ బ్యూరో ఆఫ్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఎన్‌ఫోర్స్ ప్రకారం గల్ఫ్ ఆఫ్ మెక్సీకో క్రూడ్ ప్రొడక్షన్ 66.6 శాతం క్లోజ్ అయింది. చమురు ధరలకు డిమాండ్ పెరిగేలా రష్యా, ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిలో కోతలు అమలు చేస్తున్నాయి. ప్రపంచ చమురు ఉత్పత్తిలో రోజుకు 7.7 మిలియన్ బ్యారెళ్లమేర కోతలను అమలు చేస్తున్నాయి. ఒప్పందం ప్రకారం ఉత్పత్తిలో కోతలు 2021 జనవరి వరకు అమలులో ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే జనవరి తదుపరి కోతలను ఎత్తివేసే అవకాశం లేదని చెబుతున్నారు.

English summary

చమురు ధరలు డౌన్, వచ్చే ఏడాది జనవరి వరకు ఉత్పత్తి కోత | New lockdowns push oil prices to nearly 5 month low

Crude oil futures dropped to Rs 2,665 per barrel on October 29 as participants increased their short positions.
Story first published: Friday, October 30, 2020, 16:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X