i
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Buying House: మీరు కొత్తగా ఇల్లు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా..? ఈ 10 పాయింట్లు గమనించండి..

|

Buying House: కొత్త ఇల్లు కొనడం అనేది చాలా మంది భారతీయుల జీవితాల్లో ఒక కల. వారు కొత్త ఇంటిని కొనుగోలు చేయడానికి చాలా సంవత్సరాలు గడుపుతుంటారు. ఇది సాధారణ విషయం కాదు. ఎంత పొదుపు చేసినా ఇల్లు కట్టుకోవాలంటే అప్పు చేయాల్సి ఉంటుంది. కాబట్టి జీవితకాలం కష్టపడ్డ డబ్బును జాగ్రత్తగా ఇంటి విషయంలో ఖర్చు చేస్తుంటారు. అందువల్ల మనం ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు పరిగణించవలసిన అనేక అంశాలు ఉన్నాయి. దీనికోసం ముందస్తు ప్రణాళికలు వేసుకోకుంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి రావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఇంటిని కొనుగోలు చేసే ముందు మీరు ఏమి పరిగణించాలి, ఎలా నిర్ణయం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి..

1. ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్లను సంప్రదిస్తాము. కార్పెట్ ఏరియా, బిల్ట్-అప్ ఏరియా, సూపర్-బిల్ట్-అప్ ఏరియా వంటి పదాలను ఉపయోగించి ఏజెంట్లు వివిధ ప్రాపర్టీల గురించి మీకు వివరిస్తుంటారు. కార్పెట్ ఏరియా అంటే మనం గోడలు లేకుండా ఉపయోగించగల ప్రాంతం. కాబట్టి మనం ఆస్తిని కొనుగోలు చేసే ముందు ఇంటిని నిర్మించడానికి ఎంత విస్తీర్ణంలో ఉపయోగిస్తున్నామో చూసుకోవాలి. ఈ విషయంలో కచ్చితంగా ఉండాలి. బిల్ట్-అప్ ఏరియా అంటే గోడలతో కప్పబడిన ప్రాంతం. సూపర్-బిల్ట్ అప్ ఏరియాలో పార్కింగ్, లిఫ్ట్, లాబీ మొదలైన సాధారణ ప్రాంతాలు ఉంటాయి.

Buying House: మీరు కొత్తగా ఇల్లు కొనేందుకు ప్లాన్ చేస్తున్నా

2. ఇంటిని లోపల గది ఎలా ఉంది, బాత్రూమ్ ఎలా ఉంది, వంటగది ఎలా ఉంటుంది అని గమనిస్తుంటాం. కానీ.. ఈ సందర్భంలో ఇంటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సమీపంలో మెట్రో, రైల్వే స్టేషన్, ఆసుపత్రి, స్కూల్స్, ఇతర అత్యవసరాలు అందుబాటులో ఉన్నాయో లేవో దృష్టిలో పెట్టుకుని ఇల్లు కొనాలని గుర్తుంచుకోండి.

3. మీరు ఫ్లాట్‌లో లేదా ఇరుగుపొరుగు ఇళ్లు ఉన్న ప్రాంతంలో ఇల్లు కొంటున్నట్లయితే.. ఆ ఇంటి సమీపంలో ఎవరు నివసిస్తున్నారో నిర్ధారించుకోండి. కొన్ని సాధారణ సౌకర్యాలను షేర్ చేసుకోవటం సాధ్యమవుతుందో లేదో చూడండి. మీలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తుల చుట్టూ ఉండటం బాధించదు. కాబట్టి.. మీలాంటి మైండ్ సెట్ గల వ్యక్తులు మీ పొరుగున ఉంటున్నారో లేదో తప్పక తెలుసుకోండి. ఆ కమ్యూనిటీలో ఇమడగలిగితేనే అక్కడ ఇల్లు కొనుక్కోవటం ఉత్తమం.

4. మీరు ఇల్లు కొనడానికి డబ్బు ఖర్చు చేసే ముందు న్యాయ సలహా తప్పక తీసుకోండి. అన్ని పత్రాలను లాయర్ తో తనిఖీ చేయించుకోండి. కొన్ని చోట్ల ఆస్తి తగాదాలు ఉండవచ్చు. కాబట్టి లీగల్ ఇష్యూస్ లేకుండా ఉండేలా చూసుకోండి. పూర్తి వివరాలు తెలిసిన వారిని సంప్రదించి కొనుగోలుపై తుది నిర్ణయం తీసుకోండి.

5. ఇల్లు కొనే విషయంలో అన్ని సౌకర్యాలు ఎలా ఉన్నాయనే విషయమే మిమ్మల్ని ఒప్పించే ప్రధాన అంశంగా ఉంటుంది. డీలర్ల మాటలు విని హడావిడిగి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. కొనటానికి ముందు సదరు ప్రాపర్టీని ప్రత్యక్షంగా వెళ్లి చూడండి, ఇరుగుపొరుగు వారిని సంప్రదించండి. కరెంట్, నీరు వంటి సౌకర్యాలు ఎలా ఉన్నాయో గమనించాలి. దీనికి తోడు స్విమ్మింగ్ పూల్ లాంటివి ఉంటే అవి శుభ్రంగా ఉన్నాయో లేదో కూడా సరిచూసుకోండి.

6. భవిష్యత్తులో అంతస్తులు వేయడం లేదా ఇంటిని భవనంగా మార్చడం సాధ్యమవుతుందా అనే విషయాలను పరిశీలించి ఇల్లు కొనండి. అలాగే ఇంటి దగ్గర చిన్న ఇల్లు ఉండేలా చూసుకోవాలి. మీది ఫ్లాట్ అయితే లేదా సమీపంలో పెద్ద భవనం ఉంటే మీరు పరిసరాలను చూడలేరు. భవనం కూలిపోయే అవకాశాలు వంటివి ఉండవచ్చు.

7. ముందుగా ఆస్తి మీ బడ్జెట్‌కు సరిపోతుందో లేదో చూసుకోండి. నిర్వహణ ఖర్చు, ఇతర ఛార్జీలు, ఆస్తిపన్ను వంటి ఖర్చులను పరిగణలోకి తీసుకోవటం చాలా కీలకం.

8. మీరు ఇంటిని కొనుగోలు చేసే ముందు హోమ్ లోన్ అన్ని వివరాలు తెలుసుకోండి. మీకు వీలైన చోట తక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని పొందండి. ఇంటి యజమాని ఎవరు, వారితో సరిగ్గా వ్యాపారం చేయడం సాధ్యమేనా అని కూడా ముందుగా తెలుసుకోండి.

9. ఏదైనా గొడవలు జరగకుండా నివారించేందుకు ముందుగా ఆస్తి మొత్తాన్ని డీలర్‌తో చర్చించండి. ఎందుకంటే చివరికి ఆస్తి కొనుగోలు ఖర్చు ఎక్కువగా ఉంటే.. అది మీకు భారంగా మారుతుంది.

10. మీరు కొనుగోలు చేస్తున్న ఇల్లు లేదా ఆస్తి పరిసర ప్రాంతంలో ఆస్తి విలువ ఎలా ఉందో కూడా తెలుసుకోండి. ఇతర ప్రాపర్టీలకు మార్కెట్ విలువలు ఎలా తప్పక తెలుసుకోవటంతో పాటు.. ముఖ్యంగా మీరు కొనుగోలు చేయబోయే ఇంటి నిర్మాణ నాణ్యతను కూడా తెలుసుకోండి.

English summary

new home buyers should keep these points in mind while planning to purchase new property for first time

new home buyers should keep these 10 ponits in mind while planning a property
Story first published: Monday, July 4, 2022, 11:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X