For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్ ఆర్థికవ్యవస్థకు ప్రమాదం: ప్రజలకు ఈ 2 కీలకం, ఇదే ప్రభుత్వం ధైర్యం... సుబ్రమణియం

|

భారత వృద్ధి రేటును రేటింగ్ ఏజెన్సీలు భారీగా కుదిస్తున్నాయి. మూడీస్ 2.5 శాతం నుండి 0.2 శాతానికి తగ్గించింది. ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ కూడా గతంలో వేసిన అంచనా 5.6 శాతం నుండి 0.8 శాతానికి కుదించింది. కరోనా మహమ్మారి, లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా నుండి ప్రతి దేశం కకావికళమవుతున్నాయి. కరోనా నుండి భారత ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకోవడానికి ఆర్థిక నిపుణులు సూచనలు చేస్తున్నారు.

షాకింగ్: మాల్యా-చోక్సీ సహా 50 మంది టాప్ డిఫాల్టర్ల రూ.68,600 కోట్ల రుణాలు రద్దు!షాకింగ్: మాల్యా-చోక్సీ సహా 50 మంది టాప్ డిఫాల్టర్ల రూ.68,600 కోట్ల రుణాలు రద్దు!

రూ.10 ట్రిలియన్లు అవసరం

రూ.10 ట్రిలియన్లు అవసరం

కరోనా కారణంగా భారత్ గణనీయ ప్రతికూల అభివృద్ధి నమోదు చేస్తుందని, దీనిని అధిగమించేందుకు సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని మాజీ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రమణియన్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ప్రభుత్వం నుండి రూ.10 ట్రిలియన్ల ఆర్థిక ప్యాకేజీ అవసరమని చెప్పారు.

క్యాష్, ఫుడ్ కీలకం..

క్యాష్, ఫుడ్ కీలకం..

ప్రస్తుత సంక్షోభం నుండి ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం వద్ద క్యాష్, ఫుడ్ పంపిణీ చేయవలసి ఉంటుందని, భారత్‌కు ఇవే ప్రధాన సాధనాలు అన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల మంది పేదలకు ఉచిత బియ్యం, పప్పు, గ్యాస్ సిలిండర్ ఇస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి బ్యాంకు అకౌంట్లలో కొంత మొత్తం వేస్తున్నాయి.

అందువల్ల ఉద్దీపన ప్యాకేజీ ధైర్యం

అందువల్ల ఉద్దీపన ప్యాకేజీ ధైర్యం

ఆహారం ధరలు తక్కువగా ఉండటం, చమురు ధరలు భారీగా పడిపోవడం, ఇండియా ప్రస్తుత కరెన్సీ నిల్వల వంటి కారణాలు ప్రభుత్వాలు ధైర్యంగా ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు. జీడీపీలో 5 శాతం రూ.10 లక్షల కోట్లు అవసరమన్నారు.

ఇండియా వృద్ధి రేటు

ఇండియా వృద్ధి రేటు

కాగా, ఏడాది వృద్ధి రేటు క్షీణించడంతో ఆర్థికంగా మరిన్ని సడలింపు చర్యలు చేపట్టే ఆస్కారం ఉన్నందున, వృద్ధి మరింత క్షీణిస్తే భారత్ రేటింగ్ తగ్గింపు ముప్పు పొంచి ఉందని ఫిచ్ హెచ్చరించింది. ఈ ఏడాది జీడీపీలో రుణ బారం గత ఏడాదితో పోలిస్తే 70 శాతం నుండి 77 శాతానికి పెరగవచ్చునని తెలిపింది. కరోనా - లాక్ డౌన్ అనంతరం భారత్ నడిచే బాట ఆధారంగా మధ్యకాలిక ఆర్థిక ధోరణిని బట్టి రేటింగ్ నిర్ణయిస్తామని తెలిపింది. గత ఏడాది డిసెంబర్‌లో BBB మైనస్ రేటింగ్ కొనసాగుతుందని, ఈ ఆర్థిక సంవత్సరానికి 0.8 శాతానికి అంచనా వేసినట్లు తెలిపింది.

English summary

భారత్ ఆర్థికవ్యవస్థకు ప్రమాదం: ప్రజలకు ఈ 2 కీలకం, ఇదే ప్రభుత్వం ధైర్యం... సుబ్రమణియం | Need Rs 10 tn stimulus to tide over a contraction in GDP: Arvind Subramanian

Fitch Ratings said India’s sovereign rating of BBB- could come under pressure with a deteriorating fiscal outlook arising from weaker growth due to the Covid-19 outbreak and the lockdown.
Story first published: Wednesday, April 29, 2020, 14:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X