For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫస్ట్ దేశం, మేం రష్యా నుండి ఎందుకు కొనుగోలు చేయవద్దు: సీతారామన్

|

రష్యా నుండి క్రూడాయిల్ ధరను డిస్కౌంట్‌కు కొనుగోలు చేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగినందున దేశ ప్రజల కోసం తక్కువ ధరకు చమురు కొనుగోలు అవసరమన్నారు. రష్యా నుండి కొనుగోలును ఇప్పటికే భారత్ ప్రారంభించిందన్నారు. మంచి ఒప్పందం కోసం భారత్ ఎదురు చూడటం సహజమైన ప్రక్రియ అన్నారు. రషథ్యా నుండి ఇప్పటికే చమురు కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందన్నారు.

రష్యా నుండి మూడు నుండి నాలుగు రోజుల ఆయిల్ సరఫరా కూడా అందుకున్నట్లు తెలిపారు. మరింత చమురు కోసం అవసరమైన ప్లాన్స్ పైన పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కసరత్తు చేస్తున్నారన్నారు. జాతీయ ప్రయోజనాలు, ఎనర్జీ, ఎనర్జీ సెక్యూరిటీ ముఖ్యమన్నారు. డిస్కౌంట్‌లో ఇంధనం దొరుకుతుంటే మనం ఎందుకు కొనుగోలు చేయవద్దని ప్రశ్నించారు.

 Nations interest first, why shouldnt we buy cheap oil from Russia: Sitharaman

ఉక్రెయిన్ పై న యుద్ధం కంటే ముందు ఉన్న చమురు ధర కంటే బ్యారెల్‌కు 35 డాలర్ల డిస్కౌంట్ భారత్‌కు ఇచ్చేందుకు కూడా రష్యా ముందుకు వచ్చింది. యుద్ధం కారణంగా ఇతర దేశాలకు చమురు అమ్మకాలు బాగా తగ్గడంతో రష్యా ఈ ఆఫర్ భారత్‌కు ఇచ్చిందని చెబుతున్నారు. మరోవైపు చెల్లింపుల కోసం రూపాయి-రూబుల్ డినామినేషన్‌ను వినియోగించేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.

English summary

ఫస్ట్ దేశం, మేం రష్యా నుండి ఎందుకు కొనుగోలు చేయవద్దు: సీతారామన్ | Nation's interest first, why shouldn't we buy cheap oil from Russia: Sitharaman

Finance minister Nirmala Sitharaman said India will continue buying cheap Russian oil as the nation's interest comes first. “I would put my energy security first.
Story first published: Sunday, April 3, 2022, 11:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X