For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IT Jobs: ఈ టెక్నాలజీ నేర్చుకున్న వారికి డిమాండ్.. 1.4 కోట్ల ఉద్యోగాలు.. నాస్కామ్ నివేదిక వెల్లడి..

|

Cloud Technology: డిజిటలైజేషన్ వేగంగా జరుగుతున్నందున కొన్నిటెక్నాలజీలకు డిమాండ్ పెరుగుతోంది. అందులో క్లౌడ్ టెక్నాలజీ ముందు వరుసలో ఉంది. దీని ద్వారా రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగ కల్పన జరుగుతుందని తెలుస్తోంది. క్లౌడ్‌ టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగం వల్ల దేశ జీడీపీకి 380 బిలియన్ డాలర్ల ఆదాయ అవకాశం ఉందని, 2026 నాటికి ఈ టెక్నాలజీ ద్వారా 1.4 కోట్ల ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టి జరగే అవకాశం ఉందని నాస్కామ్ తాజా నివేదికలో వెల్లడించింది.

ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే..

ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే..

ఈ విషయంలో వ్యాపారాలు, ప్రభుత్వం క్లౌడ్ స్వీకరణకు ఆలస్యం చేస్తే 2026 నాటికి భారత జీడీపీకి 118 బిలియన్ డాలర్లు, 50 లక్షల ఉద్యోగ అవకాశాలు కోల్పోయే అవకాశం ఉందని నాస్కామ్ హెచ్చరించింది.

 ఏ రంగాల్లో ఉద్యోగాలు..

ఏ రంగాల్లో ఉద్యోగాలు..

గ్లోబల్ ప్లేయర్‌లు.. 3D ప్రింటింగ్, IoT, రోబోటిక్ ఆటోమేషన్, క్లౌడ్‌లో స్లో లేదా తక్కువ అడాప్షన్ వంటి కొత్త సిస్టమ్‌ల వైపు పయనించడం వల్ల భారతీయ పరిశ్రమలు పోటీతత్వాన్ని కోల్పోవచ్చు. దీనివల్ల పెట్టుబడిదారులు, కొత్త వ్యాపారాల్లో భారత్ తన ఆకర్షణను కోల్పోవచ్చని..'ఫ్యూచర్ ఆఫ్ క్లౌడ్ అండ్ ఇట్స్ ఎకనామిక్ ఇంపాక్ట్: ఇండియాకు అవకాశం' అనే పేరుతో రూపొందిచిన నివేదికలో వెల్లడించింది. ఇందుకోసం ఉద్యోగుల రీ-స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్ అవసరమని నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్జానీ ఘోష్ వివరించారు.

భారత్ ప్రారంభ దశలోనే..

భారత్ ప్రారంభ దశలోనే..

పరిపక్వ మార్కెట్లతో పోలిస్తే భారత్ ఇప్పటికీ క్లౌడ్ స్వీకరణ ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ, కరోనా మహమ్మారి కారణంగా క్లౌడ్‌కు మారడం అనివార్యంగా మారింది. దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్లాట్‌ఫారమ్, సాఫ్ట్‌వేర్ ద్వారా దేశంలో వ్యాపారాలు, ప్రభుత్వం తమ డిజిటలైజేషన్ ప్రయాణాన్ని వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక సేవలు వంచి కీలక రంగాల్లో డిజిటలీకరణ వేగంగా జరుగుతోంది.

ప్రభుత్వ చర్యలు..

ప్రభుత్వ చర్యలు..

మైగోవ్ సాథీ, కర్ఫ్యూ ఈపాస్, కొవిడ్-19 రిపోజిటరీ, ఆరోగ్య సేతు, కొవిన్ వంటి క్లౌడ్ ఆధారిత కార్యక్రమాలు పౌర సేవలను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం ఇవి ప్రారంభించడం క్లౌడ్ పాత్ర ప్రాముఖ్యతకు కొన్ని ఉదాహరణలుగా చెప్పుకోవాలి. రానున్న కాలంలో క్లౌడ్ టెక్నాలజీలో ప్రావీణ్యం కలిగిన నవ టెక్కీలకు మంచి ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

English summary

IT Jobs: ఈ టెక్నాలజీ నేర్చుకున్న వారికి డిమాండ్.. 1.4 కోట్ల ఉద్యోగాలు.. నాస్కామ్ నివేదిక వెల్లడి.. | Nasscom says Cloud adoption going to create 1.4 crore jobs along with revenue to gdp in 2026

Nasscom says Cloud adoption can create 14 million jobs, add $380 billion to India's GDP by 2026..
Story first published: Saturday, July 23, 2022, 11:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X