For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెట్ స్కీంలకు భలే డిమాండ్.. మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల్లో నయా రికార్డ్

|

మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ సరికొత్త శిఖరాలకు చేరుకుంది. ఈ రంగంలోని కంపెనీల ఆస్తుల విలువ నవంబర్ చివరినాటికి 27 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. డెట్ ఆధారిత పథకాల్లోకి ఎక్కువగా పెట్టుబడులు వచ్చాయి. దీంతో ఈమొత్తంగా మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఆస్తులు పెరిగాయి. డెట్ ఆధారిత పథకాల్లో బ్యాంకింగ్, పీ ఎస్ యు ఫండ్స్ క్కూడా ఉన్నాయి.

* ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో 44 కంపెనీలు ఉన్నాయి. వీటి నిర్వహణలో ఆస్తులు అక్టోబర్ తో ముగిసిన కాలానికి 26.33 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇవి నవంబర్ చివరి నాటికీ 3 శాతం మేర పెరిగి 27 లక్షల కోట్లు దాటాయి.

* మ్యూచువల్ ఫండ్స్ లోకి నవంబర్ లో 54,419 కోట్లు, అక్టోబర్ లో 1.33 లక్షల కోట్లు వచ్చాయి.

* డెట్ ఆధారిత పథకాల్లోకి 51,000 కోట్లు వచ్చాయని ఫండ్ మేనేజర్లు చెబుతున్నారు. డెట్ పథకాల్లో ఓవర్నైట్ ఫండ్స్ లోకి 20,650 కోట్లు వచ్చాయి.

* బ్యాంకింగ్, పీ ఎస్ యు ఫండ్స్ లోకి 7,230 కోట్లు వచ్చాయి. లిక్విడ్ ఫండ్స్ లోకి 6,938 కోట్లు వచ్చాయి. ట్రెజరీ బిల్స్, సర్టిఫికెట్స్ అఫ్ డిపాజిట్, కమర్షియల్ పేపర్లు వాటిని వాటిలో పెట్టుబడులు పెరిగాయి.

ఓపెన్ ఎండెడ్ పథకాల్లోకి కూడా

ఓపెన్ ఎండెడ్ పథకాల్లోకి కూడా

* నవంబర్ నెలలో ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకాల్లోకి 1,312 కోట్లు వచ్చాయి. క్లోజ్ ఎండెడ్ ఈక్విటీ ప్లాన్ల లో నుంచి 379 కోట్లు బయటకు వెళ్లాయి. దీంతో నికర పెట్టుబడులు 933 కోట్లుగా ఉన్నాయి. అక్టోబర్ లో ఈ పథకాల్లోకి నికరంగా వచ్చిన పెట్టుబడులు 6,015 కోట్లుగా ఉన్నాయి.

* ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఈక్విటీ ఫండ్స్ లోకి పెట్టుబడులు తగ్గాయి. దీంతో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు జీవిత కాల గరిష్ట స్థాయిలో 27 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

సిప్ పెట్టుబడులు

సిప్ పెట్టుబడులు

* దీర్ఘకాలిక క్రమానుగత పెట్టుబడి ప్లాన్ (సిప్) పెట్టుబడులు నిలకడగా పెరుగుతున్నాయి. తాజాగా సిప్ నిర్వహణలో ఆస్తులు జీవిత కాల గరిష్ట స్థాయిలో 3.12 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

* గోల్డ్ ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్స్ లోకి 7 కోట్ల రూపాయలు వచ్చాయి. అక్టోబర్ లో పెట్టుబడులు 31.45 కోట్లు తరలి పోయాయి. సెప్టెంబర్లో 44 కోట్ల రూపాయలు, ఆగస్టులో 145 కోట్ల పెట్టుబడులు ఈ ఫండ్స్ లోకి వచ్చాయి.

ఇన్వెస్టర్లకు మరో ప్రత్యామ్నాయం

ఇన్వెస్టర్లకు మరో ప్రత్యామ్నాయం

* తమ పెట్టుబడులపై మంచి రాబడులను ఆశించే ఇన్వెస్టర్ల కోసం కొత్తగా భారత్ బాండ్ ఈటీఎఫ్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఇన్వెస్టర్లు ఈ నెల 20 వరకు సబ్ స్క్రైబ్ చేసే అవకాశం ఉంది. మూడేళ్లు, పదేళ్ల కాలానికి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.

English summary

డెట్ స్కీంలకు భలే డిమాండ్.. మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల్లో నయా రికార్డ్ | Mutual fund assets rises to all time high

The total assets under management of the mutual fund industry crossed 27 lakh crore till November end. While the total AUM rose, the net flows fell considerably, especially in the debt segment wherein it more than halved compared with October. Income or debt segment saw inflows to tune of 51,427 core.
Story first published: Saturday, December 14, 2019, 15:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X