For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mukesh Ambani Resign: ఆ పదవికి ముఖేష్ అంబానీ రాజీనామా.. తనయుడు ఆకాశ్ అంబానీకి పగ్గాలు..

|

భారత టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో కంపెనీలో అతి పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టడం జరిగింది. దేశంలో దిగ్గజ వ్యాపార సామ్రాజ్యంలో యాజమాన్య మార్పు అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దిగ్గజ వ్యాపారవేత్త, కుబేరుడు ముఖేష్ అంబానీ రిలయన్స్ రిలయన్స్ జియో కంపెనీలోని టెలికాం మేజర్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఇకపై రిలయన్స్ జియో బోర్డు ఛైర్మన్‌గా.. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ నియామకానికి ఈరోజు ఆమోదం తెలిపినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ముఖేష్ అంబానీ తీసుకున్న ఈ తాజా నిర్ణయం కారణంగా రిలయన్స్ సంస్థల్లో కొత్తతరం వారసులు పూర్తి స్థాయిలో కంపెనీ బాధ్యతలను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. తండ్రి ముఖేష్ అంబానీ తన బాధ్యతలను తనయుడు ఆకాష్ అంబానీకి అప్పగించేందుకు తన పదవికి జూన్ 27న రాజీనామా చేశారు. రిలయన్స్ కంపెనీలను డీమెర్జర్ చేస్తారని మార్కెట్ వర్గాలు భావిస్తుండగా, రిలయన్స్ సంస్థ షేర్ హోల్డర్లతో యాన్యువల్ జనరల్ మీటింగ్ దగ్గర పడుతున్న సమయంలో ఈ వార్త రావటం అందరనీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Mukesh Ambani resigns from board of Reliance Jio and made his son Akash ambani as the chairman

ఇదే సమయంలో.. జియో జూన్ 27, 2022 నుంచి ప్రారంభమయ్యే ఐదేళ్ల కాలానికి రమీందర్ సింగ్ గుజ్రాల్, కె వి చౌదరిలను డైరెక్టర్లుగా నియమించింది.జూన్ 27, 2022 నుంచి ఐదేళ్లపాటు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పంకజ్ మోహన్ పవార్ నియామకాన్ని జియో ఆమోదించింది. భారతీయ టెలికాం రంగం కొన్ని నెలల్లో 5G నెట్‌వర్క్‌ను వివియోగదారులకు చేరువచేయనున్న సమయంలో ఆకాష్ అంబానీ బాధ్యతలు స్వీకరించారు. పరిశ్రమలో స్థిరత్వాన్ని సూచించడానికి కీలకమైన మెట్రిక్ అయిన వినియోగదారుకు సగటు ఆదాయాన్ని పెంచాలని ఆయన చూస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉన్న భారత టెలికాం రంగంలో నవతరం మేనేజ్ మెంట్ బాధ్యతలు అందిపుచ్చుకోవటం ఇదే తొలిసారి కావటం విశేషం.

English summary

Mukesh Ambani Resign: ఆ పదవికి ముఖేష్ అంబానీ రాజీనామా.. తనయుడు ఆకాశ్ అంబానీకి పగ్గాలు.. | Mukesh Ambani resigns from board of Reliance Jio and made his son Akash ambani as the chairman

The announcement comes days ahead of the RIL AGM where Street is expecting demerger plans from the oil-to-telecom conglomerate
Story first published: Tuesday, June 28, 2022, 17:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X