For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mukesh Ambani: ఫ్యాషన్ ప్రియులకు సూపర్ న్యూస్.. భారత్ కు ఫైమస్ US బ్రాండ్.. ముఖేష్ అంబానీ ప్లాన్..

|

Mukesh Ambani GAP Deal: గత కొంత కాలంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అనేక కొత్త కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. శరవేగంగా దూసుకుపోతున్న ఆయన తాజాగా మరో పెద్ద డీల్ కుదుర్చుకున్నారు. దీంతో ఇకపై అమెరికాకు చెందిన ఫ్యాషన్ బ్రాండ్ 'GAP' ఉత్పత్తులు రిలయన్స్ స్టోర్‌లో అందుబాటులో ఉంటాయి.

ఇది రిలయన్స్ రిటైల్ బలమైన ఓమ్నిచానెల్ రిటైల్ నెట్‌వర్క్‌ వల్ల 'GAP' సంస్థకు సైతం మంచి ప్రయోజనాన్ని కలిగించనుంది. దీనికి తోడు రిలయన్స్ రిటైల్ తన ప్రత్యేకమైన బ్రాండ్ స్టోర్లు, మల్టీ-బ్రాండ్ స్టోర్లు, డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా దేశీయ వినియోగదారులకు గ్యాప్ బ్రాండ్ ఫ్యాషన్ దుస్తులు అందుబాటులో ఉంటాయి.

రిలయన్స్ రిటైల్ ప్రకటన.

రిలయన్స్ రిటైల్ ప్రకటన.

ఈ డీల్‌కు సంబంధించిన సమాచారాన్ని రిలయన్స్ రిటైల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందం స్థానికంగా ఉత్పత్తిని పెంచడంతో పాటు స్థానికంగా ముడి పదార్థాల కొనుగోలును కూడా ప్రోత్సహిస్తుంది. ఇది రిలయన్స్ రిటైల్‌కు 'GAP' అగ్ర క్యాజువల్ ఫ్యాషన్ బ్రాండ్‌గా అంగీకరించడం ద్వారా ప్రయోజనం పొందుతుంది. అదే సమయంలో రిలయన్స్ రిటైల్ బలమైన ఓమ్నిచానెల్ రిటైల్ నెట్‌వర్క్‌ను నడిపించే నిరూపితమైన సామర్థ్యం వల్ల అమెరికన్ బ్రాండ్ లాభపడుతుందని కంపెనీ తెలిపింది.

రెండు కంపెనీకూ ప్రయోజనం..

రెండు కంపెనీకూ ప్రయోజనం..

రిలయన్స్ రిటైల్‌లో కస్టమర్‌లకు న్యూ అండ్ బెస్ట్ ఫ్యాషన్ ఉత్పత్తులను అందించడానికి ప్రయత్నిస్తున్నట్లు రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ CEO అఖిలేష్ ప్రసాద్ అన్నారు. ఫ్యాషన్, లైఫ్ స్టైల్ పోర్ట్‌ఫోలియోకు ఐకానిక్ అమెరికన్ బ్రాండ్ గ్యాప్‌ను చేర్చటం పట్ల సంతోషంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ డీల్ ద్వారా దేశీయ కస్టమర్లకు అత్యుత్తమ రిటైల్ అనుభవాన్ని అందించడంలో పాటుగా రెండు కంపెనీలకూ ప్రయోజనం కలుగుతుందని నమ్ముతున్నట్లు ఆయన చెప్పారు.

డెనిమ్ ఆధారిత ఫ్యాషన్‌కు Gap ప్రసిద్ధి..

డెనిమ్ ఆధారిత ఫ్యాషన్‌కు Gap ప్రసిద్ధి..

Gap Inc పురుషులు, మహిళలు, పిల్లల కోసం దుస్తులు, ఉపకరణాలు, ప్రత్యేక ఉత్పత్తులను తయారు చేసే లైఫ్ స్టైల్ బ్రాండ్‌. ఈ అమెరికన్ దుస్తుల తయారీ కంపెనీ శాన్ ఫ్రాన్సిస్కోలో 1969లో స్థాపించబడింది. ఇది డెనిమ్ ఆధారిత ఫ్యాషన్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. Gap Inc గత ఆర్థిక సంవత్సరంలో 16.7 బిలియన్ డాలర్ల సేల్స్ చేసింది. మరోవైపు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ విభాగం అయిన రిలయన్స్ రిటైల్ భారత్ లో అతిపెద్ద రిటైల్ చైన్‌లలో ఒకటిగా పనిచేస్తోంది.

గ్యాప్ కు రిలయన్స్ సహాయం..

గ్యాప్ కు రిలయన్స్ సహాయం..

కీలక అంతర్జాతీయ మార్కెట్లలో గ్యాప్ వ్యాపారాన్ని వృద్ధి చేసేందుకు మేము ఎదురుచూస్తున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ (గ్లోబల్ లైసెన్సింగ్ & హోల్‌సేల్) అడ్రియన్ గెర్నాండ్ అన్నారు. దేశంలోని రిలయన్స్ రిటైల్ వంటి ప్రాంతీయ కంపెనీతో భాగస్వామ్యం మా బ్రాండ్‌ను కొత్త కస్టమర్ల వద్దకు తీసుకెళ్లడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు. ఇలాంటి భాగస్వామ్యాల వల్ల తమ వ్యాపార పోర్ట్‌ఫోలియోను ప్రపంచవ్యాప్తంగా విస్తరించుకోగలుగుతామని చెప్పారు.

English summary

Mukesh Ambani: ఫ్యాషన్ ప్రియులకు సూపర్ న్యూస్.. భారత్ కు ఫైమస్ US బ్రాండ్.. ముఖేష్ అంబానీ ప్లాన్.. | mukesh ambani's reliance retail chain made deal with us denim fashion brand GAP soon available in indian market

mukesh ambani mega deal with us fashion brand GAP..
Story first published: Thursday, July 7, 2022, 14:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X