బీజింగ్: 2020 క్యాలెండర్ ఏడాదిలో ఆసియా కుబేరుడి అవతారం నుండి వరల్డ్ టాప్ 10లోకి వచ్చిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అంతలోనే ఆ జాబితా నుండి ఔట్ అయ్యారు. తాజాగా ముఖేష్‌ను వెనక్కి నెట్టి చైనాకు చెందిన ఇండస్ట్రియలిస్ట్ ఆసియా కుబేరుడిగా నిలిచారు. చైనీస్ ప్రయివేటు బిలియనీర్ జోంగ్ షంషాన్ ఆసియా ధనవంతుడిగా నిలిచినట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించింది. ఇటివలీ వరకు ఆసియా కుబేరుడిగా ఉన్న ముఖేష్ అంబానీని ఆయన వెనక్కి నెట్టారు.

ఆ రెండు కంపెనీల ప్రభావంతో
జోంగ్ షంషాన్‌కు చెందిన రెండు కంపెనీలు... వ్యాక్సీనే మేకర్ బీజింగ్ వాంతాయ్ బయోలాజికల్ ఫార్మసీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ, నోంగు స్ప్రింగ్ కంపెనీలు 2020లో భారీగా ఎగిశాయి. దీంతో ఈ క్యాలెండర్ ఇయర్ చివరలో జోంగ్ షంషాన్... ముఖేష్ అంబానీ కంటే పైకి వచ్చారు. ఈ రెండు కంపెనీలు వరుసగా 155 శాతం, 2000 శాతం పైకి ఎగిశాయి. దీంతో జోంగ్ షంషాన్ నికర ఆదాయం 77.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో అతని సంపద 70.9 బిలియన్ డాలర్లుగా ఉంది. జోంగ్ షంషాన్... చైనాకు చెందిన అలీబాబా అధినేత జాక్ మాను కూడా అధిగమించాడు.

అందుకే ముఖేష్ ఔట్
జోంగ్ షంషాన్ అత్యంత వేగంగా ఆసియా కుబేరుడిగా అవతరించారు. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్.. గూగుల్, ఫేస్‌బుక్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. అయినప్పటికీ ఇటీవల రిలయన్స్ స్టాక్ పడిపోవడంతో ముఖేష్ ఆస్తులు క్షీణించి, ఆసియా కుబేరుడి స్థానం కోల్పోయారు. ముఖేష్ నికర ఆస్తులు 18.3 బిలియన్ డాలర్లు క్షీణించడంతో 76.9 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ ఏడాది రిలయన్స్ స్టాక్ రూ.2370ని తాకినప్పటికీ ఇప్పుడు రూ.2000 దిగువనే ఉన్నాయి. ఈ ప్రభావం ఆదాయంపై ప్రభావం చూపింది.

అలీబాబా ఆస్తులు
ఇక, అలీబాబా సహ వ్యవస్థాపకులు జాక్ మా నికర ఆదాయం అక్టోబర్ చివరి నుండి 11 బిలియన్ డాలర్లు తగ్గింది. దీంతో 61.7 బిలియన్ డాలర్ల నుండి 50.9 బిలియన్ డాలర్లకు తగ్గింది. జోంగ్ షంషాన్ ప్రపంచ కుబేరుల్లో 11వ స్థానంలో ఉన్నారు. జాక్ 25వ స్థాంలో నిలిచారు. ఇక కొద్ది నెలల క్రితం ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ ఇటీవల టాప్ 10 నుండి పడిపోయారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications