For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.10 లక్షల కోట్ల రుణాలు పునర్వ్యవస్థీకరణ, రియాల్టీ సహా ఊరట

|

కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిని, ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్న వివిధ రంగాలకు రుణాల పునర్వ్యవస్థీకరణను అందించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) త్వరలో విడుదల చేయనుంది. రుణాల పునర్వ్యవస్థీకరణ పెద్దమొత్తంలో ఉండనుందని తెలుస్తోంది. ఈ మేరకు బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. కరోనా కారణంగా అన్ని రంగాలపై తీవ్రంగా దెబ్బపడింది. లాక్ డౌన్ మరింతగా దెబ్బతీసింది. దీంతో ఇప్పటికే ఆర్బీఐ కల్పించిన లోన్ మారటోరియం ఆగస్ట్ 31వ తేదీతో ముగిసింది. రుణ పునర్వ్యవస్థీకరణ కోసం వివిధ రంగాలు ఇప్పటికే కోరాయి.

Loan moratorium: త్వరలో రుణపునర్వ్యవస్థీకరణ గైడ్‌లైన్స్Loan moratorium: త్వరలో రుణపునర్వ్యవస్థీకరణ గైడ్‌లైన్స్

రూ.10 లక్షల కోట్ల వరకు ఉండవచ్చు

రూ.10 లక్షల కోట్ల వరకు ఉండవచ్చు

కరోనా, లాక్డౌన్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రంగాలకు రుణపునర్వ్యవస్థీకరణ అందించనున్నారని, దీని పరిమాణం రూ.10లక్షలకోట్లకు పైగా ఉండవచ్చునని బ్యాంకర్లు అంటున్నారు. రుణ పునర్య్వస్థీకరణ చేపడితే తమ రుణ ఖాతాల్లో 12 శాతం నుండి 15 శాతం ఖాతాలకు దానిని వర్తింప చేసే వెసులుబాటు ఉందని బ్యాంకర్లు చెబుతున్నారు. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థ రుణ చిట్టాల పరిమాణం రూ.100 లక్షల కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా.

ఈ రంగాల్లో.. ఊరట

ఈ రంగాల్లో.. ఊరట

కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రియాల్టీ, హాస్పిటాలిటీ, విమానయానం వంటి ఐదారు రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రుణ పునర్నిర్మాణ పథకాన్ని సెప్టెంబర్ 15వ తేదీకల్లా తీసుకురావాలని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అటు బ్యాంకర్లు, ఇటు రుణగ్రహీతలకు ఇది కాస్త ఊపిరిపీల్చుకునే విషయం. రుణ పునర్వ్యవస్థీకరణ ద్వారా కార్పోరేట్లు తమ వ్యాపారాలను ఎన్పీఏలుగా మారకుండా చూసుకోవచ్చు. ఎంఎస్ఎంఈలకు ఇప్పటికే రుణ పునర్వ్యవస్థీకఱణ ప్రయోజనం అందించినందున ఇప్పుడు కార్పోరేట్లకు దానిని విస్తరించాల్సి ఉంటుంది.

రుణపునర్నిర్మాణంపై ముందుకు వెళ్లవచ్చు

రుణపునర్నిర్మాణంపై ముందుకు వెళ్లవచ్చు

ఆగస్ట్ 31వ తేదీ నాటికి మొత్తం రుణ జాబితాలో 30 శాతం మందిలో సగం మంది మారటోరియం వెసులుబాటును ఉపయోగించుకున్నారు. వారు ఇప్పుడు రుణ పునర్వ్యవస్థీకరణ ప్రయోజనం ఉపయోగించుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. బ్యాంకులు కేవలం 10 శాతం మాత్రమే రుణపునర్నిర్మాణ ఖాతాకు కేటాయించాల్సి ఉంటుంది. అదే ఖాతా ఎన్పీఏగా మారితే పదిహేను శాతం కేటాయించాలి. బ్యాంకులు పునర్నిర్మాణానికి వెళ్లవచ్చునని భావిస్తున్నారు.

ఆర్థిక అంశాలపై కమిటీ అధ్యయనం

ఆర్థిక అంశాలపై కమిటీ అధ్యయనం

రుణ పునర్వ్యవస్థీకరణ ఆర్థిక భారం ఎంత ఉంటుంది, ప్రయోజనం అందించిన తర్వాత రుణ ఈక్విటీ నిష్పత్తి, రుణ సర్వీసింగ్ కవరేజ్ నిష్పత్తి, వడ్డీ కవరేజీ నిష్పత్తి ఎంత ఉంటుందనే ఆర్థికపరమైన అంశాలపై కేవీ కామత్ కమిటీ అధ్యయనం చేస్తోంది. గడువు ప్రకారం ఈ కమిటీ నివేదికను ఇప్పుడు సమర్పించాలి. కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత ఆర్బీఐ దానిని కార్పోరేట్ రుణపునర్వ్యవస్థీకరణ గైడ్ లైన్స్ ప్రకటించనుంది.

English summary

రూ.10 లక్షల కోట్ల రుణాలు పునర్వ్యవస్థీకరణ, రియాల్టీ సహా ఊరట | More than Rs 10 lakh crore loans may avail restructuring benefit

Banks may restructure loans of more than Rs 10 lakh crore largely attributed to 5-6 critical sectors, including aviation, commercial real estate and hospitality, that have been severely hit by the COVID-19 outbreak, according to bankers.
Story first published: Monday, September 7, 2020, 9:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X