For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత వృద్ధి రేటుపై గృహ వినియోగం దెబ్బ, షాకిచ్చిన మూడీస్! కారణాలివే..

|

అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి రేటు అంచనాను తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును గతంలో 5.8 శాతంగా గతంలో అంచనా వేసింది. అయితే హౌస్ హోల్డ్ కన్సంప్షన్ బలహీనంగా ఉండటం సహా వివిధ కారణాలతో దీనిని 4.9 శాతానికి తగ్గించింది. గత కొన్ని త్రైమాసికాలుగా ఆర్థిక వృద్ధి మందగించిందని గుర్తు చేసింది. ఇది గృహ వినియోగదారులు డెబిట్ రీపేమెంట్స్ సామర్థ్యంపై ప్రభావం చూపిందని, అలాగే, రిటైల్ లోన్ క్వాలిటీని దెబ్బతీస్తోందని పేర్కొన్నారు.

సూపర్ ఇండియా: భారత్‌ను ఫాలో కండి.. అమెరికాకు గూగుల్ సూచనసూపర్ ఇండియా: భారత్‌ను ఫాలో కండి.. అమెరికాకు గూగుల్ సూచన

పెట్టుబడుల బలహీనతకు వినిమయం తోడు

పెట్టుబడుల బలహీనతకు వినిమయం తోడు

ప్రయివేటురంగ బ్యాంకుల్లో రిటైల్ రుణాలు ఎక్కువగా ఉంటాయి. వృద్ధి రేటు మందగిస్తున్న నేపథ్యంలో ఇవి ప్రస్తుతానికి ప్రమాదంలో పడే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడింది. ఏదేమైనా మందగమనం నేపథ్యంలో నిరర్థక రుణాలు క్రమంగా పెరుగుతాయని అంచనా వేసింది. ఇప్పటికే పెట్టుబడులు బలహీనంగా మారాయని, దీనికి ఇప్పుడు వినిమయ బలహీనత కలిసిందని, ఇది భారత వృద్ధి రేటుపై ప్రభావం చూపుతుందని పేర్కొంది.

నిదానమైన ఉద్యోగ కల్పన, ఆర్థిక ఒత్తిడి

నిదానమైన ఉద్యోగ కల్పన, ఆర్థిక ఒత్తిడి

గ్రామీణంలో ఆర్థిక ఒత్తిడి, నిదానమైన ఉద్యోగ కల్పన కూడా మందగమనానికి ప్రధాన కారణాలు అని పేర్కొంది. రిటైల్ సెక్టార్‌కు ఎక్కువగా రుణాలు ఇచ్చే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్టూషన్స్ (NBFC) తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయని, ఇది మందగమన పరిస్థితులకు మరింత ఇబ్బందికరంగా మారిందని పేర్కొంది.

హౌస్ హోల్డ్ డిమాండ్ ప్రభావం

హౌస్ హోల్డ్ డిమాండ్ ప్రభావం

అయితే ఈ రేటింగ్ ఏజెన్సీ (మూడీస్) వచ్చే ఆర్థిక సంవత్సరం కాస్త ఆశాజనకంగా ఉంటుందని అభిప్రాయపడింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు వృద్ధి మాత్రం బలహీనంగానే ఉటుందని భావిస్తోంది. హౌస్ హోల్డ్ డిమాండ్ మందగించడంతో అనేక రంగాలపై ఈ ప్రభావం పడింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతోన్న విషయం తెలిసిందే. వృద్ధి రేటు మందగిస్తున్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అనేక రంగాలకు ఉద్దీపన చర్యలు ప్రకటించింది. కార్పోరేట్ ట్యాక్స్ భారీగా తగ్గించింది.

English summary

భారత వృద్ధి రేటుపై గృహ వినియోగం దెబ్బ, షాకిచ్చిన మూడీస్! కారణాలివే.. | Moody's slashes FY20 growth forecast to 4.9% on weak household consumption

Moody’s Investors Service has lowered India’s gross domestic product (GDP) growth projection for the 2019-20 fiscal year to 4.9 per cent from 5.8 per cent, citing weak household consumption.
Story first published: Tuesday, December 17, 2019, 10:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X