For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Home Ministry: ఆ ప్రభుత్వ ఉద్యోగులకు కారుణ్య నియామకాలు.. హోం మంత్రిత్వ శాఖ ఆమోదం.. పూర్తి వివరాలు..

|

Home Ministry: కారుణ్య నియామకాల విధానంలో హోం మంత్రిత్వ శాఖ భారీ మార్పులు చేసింది. దీని ప్రకారం ఇప్పుడు కేంద్ర పారామిలిటరీ బలగాల ఉద్యోగుల కుటుంబాలకు కూడా ఉద్యోగాలు లభించనున్నాయి. ఇందుకోసం కారుణ్య నియామకాల కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సవరించిన విధానాన్ని ఆమోదించింది. ఈ సవరణ ద్వారా సర్వీసులో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగులకు, వైద్య కారణాలతో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కారుణ్య నియామకం లభిస్తుంది. ఈ విధానం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. వీరిలో సెంట్రల్ పారా మిలిటరీ ఫోర్సెస్ సిబ్బంది ఉన్నారు. వారు తీవ్రవాద దాడులు, ఘర్షణలు మొదలైన వాటిలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నందున ఈ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం.. "కారుణ్య నియామక పథకం లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగిపై ఆధారపడిన వారికి కారుణ్య నియామకాన్ని అందించడం. సేవలో మరణించిన లేదా వైద్య కారణాలతో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబాలు ఈ విధానంలో ప్రయోజనం పొందుతారు. సంబంధిత ప్రభుత్వోద్యోగి కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు తీసుకురావడమే మార్గదర్శకాల ప్రధాన లక్ష్యం. కొత్త మార్గదర్శకాలు మరింత పారదర్శకతో కూడిన కారుణ్య నియామక ప్రక్రియను తీసుకువస్తాయని ఒక అధికారి వెల్లడించారు.

ministry of home affairs amended Compassionate appointments rules

'సంక్షేమ అధికారి' చనిపోయిన వారికి సహాయం చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులపై ఆధారపడిన వారికి కారుణ్య ప్రాతిపదికన నియామకం పొందడంలో మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త విధానం ఉండటం గమనార్హం. ఈ క్రమంలో సదరు కుటుంబంలో సంపాదిస్తున్న వ్యక్తులు, కుటుంబ పరిమాణం, పిల్లల వయస్సు, కుటుంబ ఆర్థిక అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

Read more about: jobs
English summary

Home Ministry: ఆ ప్రభుత్వ ఉద్యోగులకు కారుణ్య నియామకాలు.. హోం మంత్రిత్వ శాఖ ఆమోదం.. పూర్తి వివరాలు.. | ministry of home affairs amended Compassionate appointments rules in india under 7th pay commission

ministry of home affairs amended Compassionate appointments rules
Story first published: Wednesday, July 13, 2022, 10:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X