For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా బోనస్: మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు అదనంగా రూ.1.10 లక్షలు!

|

ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. కోవిడ్ 19 నేపథ్యంలో ఉద్యోగులకు ఊరటనిచ్చేలా కంపెనీ చీఫ్ పీపుల్ ఆఫీసర్ కేథ్లీన్ హోగాన్ అమెరికాలో, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు 1500 డాలర్ల పాండమిక్ బోనస్ ప్రకటించారు. ఇది మన కరెన్సీలో రూ.1.10 లక్షలకు పైగా ఉంటుంది. కరోనా కారణంగా కష్టంగా గడిచిన ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో ఉద్యోగుల కృషికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. కార్పోరేట్ వైస్ ప్రెసిడెంట్ కంటే కిందిస్థాయి ఉద్యోగులందరికీ ఈ బోనస్ వర్తిస్తుందని తెలిపింది. మార్చి 31, 2021కి ముందు ఉన్న ఉద్యోగులకు ఈ బహుమానం ఇవ్వనున్నారు.

వీరికి వర్తించదు...

వీరికి వర్తించదు...

మైక్రోసాఫ్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా 1,75,508 మంది ఉద్యోగులున్నారు. వీరికి బోనస్ కోసం సంస్థ 200 మిలియన్ డాలర్లను అదనంగా కేటాయించనుంది. ఇది మైక్రోసాఫ్ట్ కంపెనీ రెండు రోజుల ప్రాఫిట్ వ్యాల్యూ. అయితే, కంపెనీ అనుబంధ సంస్థలు లింక్డిన్, గిట్‌హబ్‌, జెనీమ్యాక్స్‌కు చెందిన ఉద్యోగులు మాత్రం బోనస్ లేదు.

మైక్రోసాఫ్ట్ సహకారం

మైక్రోసాఫ్ట్ సహకారం

మైక్రోసాఫ్ట్ వాషింగ్టన్‌లో 98 మిలియన్ డాలర్ల సహకారాన్ని అందించింది. కరోనా పాండమిక్ ప్రారంభమైనప్పటి నుండి మైక్రోసాఫ్ట్ 160 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రధానంగా క్లౌడ్ సర్వీసెస్ నుండి ఈ ఆదాయం వచ్చింది. అలాగే ల్యాప్‌టాప్ సేల్స్, విండోస్ యూసేజ్ బలమైన ఎక్స్‌బాక్స్ గ్రోత్ వల్ల ఇది సాధ్యమైంది.

ఈ కంపెనీలు కూడా..

ఈ కంపెనీలు కూడా..

ఉద్యోగులకు ఈ జూలై-ఆగస్ట్ మధ్య కాలంలో ఈ పాండమిక్ గిఫ్ట్ అందనుంది. అమెజాన్ తమ ఫ్రంట్ లైన్ వర్కర్లకు గత ఏడాది నవంబర్ నెలలోనే 300 డాలర్లను హాలీడే బోనస్‌గా ప్రకటించింది. ఫేస్‌బుక్ తమ సంస్థలోని 45 వేలమంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి 1,000 డాలర్ల బోనస్ ప్రకటించింది. హాలిడే బోనస్ కింద అమెజాన్ 300 డాలర్లు ప్రకటించింది. బీటీ 60,000 మంది ఉద్యోగులకు 2000 డాలర్ల చొప్పున ఇచ్చింది. వోక్స్ మీడియా కూడా 1000 డాలర్లు ఇచ్చింది.

English summary

కరోనా బోనస్: మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు అదనంగా రూ.1.10 లక్షలు! | Microsoft gives Rs 1 lakh cash bonus to employees amid covid 19

Microsoft is gifting its employees a $1,500 pandemic bonus. In an internal memo seen by The Verge, the software giant says this one-time bonus is in recognition of the unique and challenging fiscal year that Microsoft just completed.
Story first published: Friday, July 9, 2021, 18:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X