For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలా కూర్చోండి.. ఇలా చేయండి: ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ సూచనలు

|

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు 'వర్క్ ఫ్రం హోమ్' సదుపాయాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఒక్క ఐటీ రంగ సంస్థలే కాకుండా ఇతర రంగాలకు చెందిన సంస్థలు కూడా ఇదే విధానాన్ని అవలంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలు తమ ఉద్యోగులకు సలహాలు, సూచనలు ఇస్తున్నాయి.

ఐటీ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ కూడా తన ఉద్యోగులకు ఇలాంటి సూచనలు, సలహాలే ఇస్తోంది. వీటిని పాటించడం ద్వారా ఇంటి నుంచి మరింత బాగా పనిచేయవచ్చని, అలాగే ఖాళీ సమయాన్ని మరింత సమర్థంగా ఉపయోగించుకోవడం ఎలాగో కూడా అర్థమవుతుందని చెబుతోంది.

వైస్ ప్రెసిడెంట్ రాయగా.. సత్య నాదెళ్ల షేరింగ్...

వైస్ ప్రెసిడెంట్ రాయగా.. సత్య నాదెళ్ల షేరింగ్...

కరోనా వైరస్ కరాళ నృత్యం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ ఉద్యోగులు ఇళ్లలోంచే పని చేస్తున్నారు. ఈ పరిస్థితి మరింత ఎక్కువ కాలం కూడా ఉండవచ్చనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ కంపెనీ ఉద్యోగులై ఉండి, ప్రస్తుతం వర్క్ ఫ్రం హోమ్ పద్ధతిలో పనిచేస్తోన్న వారికి.. వారి పని మరింత సులభంగా జరిగిపోవడానికి, పని తీరు మరంత మెరుగవడానికి ఉపయోగపడే సలహాలు, సూచనలను మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ జేర్డ్ స్పటారో రాయగా.. వాటిని ఆ సంస్థ సీఈవో సత్యనాదెళ్ల ఉద్యోగులకు షేర్ చేశారు.

కొత్త ఉద్యోగుల కోసం గైడెన్స్...

కొత్త ఉద్యోగుల కోసం గైడెన్స్...

మైక్రోసాఫ్ట్ సంస్థలో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి మామూలుగా అయితే పని నేర్పించడానికి కొన్ని ట్రైనింగ్ ప్రొటోకాల్స్‌ను సిద్ధంగా ఉంచుతారు. అయితే ఇప్పుడు ఉద్యోగులు ఆఫీసులకు రావడం లేదు కాబట్టి వారికి ప్రత్యక్షంగా శిక్షణ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు ఎంత శిక్షణ పొందినా ఉద్యోగులకు తమ పనికి సంబంధించి అనేక సందేహాలు, ఇబ్బందులు తప్పవు. అసలే ఉద్యోగాలకు కొత్త.. పైగా టీమ్ లీడర్ గైడెన్స్ కూడా అందుబాటులో ఉండదు.. ఇలాంటి సమయంలో ఇంట్లోంచి పనిచేసే ఉద్యోగుల్లో తలెత్తే సందేహాలను నివృత్తి చేయడంతోపాటు మరింత మెరుగ్గా ఎలా పని చేయాలన్నది వారికి నేర్పించాల్సి ఉంటుందనేది కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ స్పటారో అభిప్రాయం.

మధ్య మధ్యలో మెడిటేషన్ బెస్ట్...

మధ్య మధ్యలో మెడిటేషన్ బెస్ట్...

ఐటీ ఉద్యోగుల్లో చాలామందికి రోజూ జిమ్‌కు వెళ్లి వర్కవుట్స్ చేసే అలవాటు ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉద్యోగులెవరూ ఇల్లు వదిలి బయటికి అడుగుపెట్టలేని పరిస్థితి. దీనికి తోడు గంటల తరబడి ఇంట్లోనే ల్యాప్‌టాప్ ముందేసుకుని కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి మధ్య మధ్యలో వీలైనప్పుడల్లా కాసేపు మెడిటేషన్(ధ్యానం) చేయాలంటూ మైక్రోసాప్ట్ తన ఉద్యోగులకు సూచించింది. అప్పుడప్పుడు ఊపిరితిత్తుల నిండుగా బాగా గాలి పీల్చి వదలాలంటూ తెలిపింది. అంతేకాదు, తన ఉద్యోగుల కోసం వర్చువల్ మెడిటేషన్ క్లాసులు కూడా నిర్వహిస్తోంది.

వర్చువల్ మెడిటేషన్ క్లాసులు...

వర్చువల్ మెడిటేషన్ క్లాసులు...

మైక్రోసాఫ్ట్ వర్క్ ఫ్రం హోమ్ విధానంలో పనిచేస్తోన్న తన ఉద్యోగుల కోసం వర్చువల్ మెడిటేషన్ క్లాసులు నిర్వహిస్తోంది. ‘‘ఎలాంటి అంతరాయం లేని, ప్రశాంతత కలిగిన చోట కూర్చోండి. మీ మైక్రోఫోన్లు మ్యూట్‌లో పెట్టండి. దీనివల్ల ఇతర ఉద్యోగులు కూడా ఆ నిశ్శబ్ద, ప్రశాంత వాతావరణాన్ని ఆనందించగలుగుతారు. మీ కెమెరా ద్వారా సెషన్ లీడర్ ఇచ్చే సూచనలను పాటించండి. ఆయన మీకు ధ్యానం, ప్రాణాయామం వంటి విషయాలు వివరిస్తారు. ఆ తరువాత కెమెరాను ఆఫ్ చేసి, వాటిని ప్రాక్టీస్ చేయండి..'' అంటూ స్పటారో తన ఉద్యోగులకు పలు సూచనలు ఇచ్చారు.

బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్...

బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్...

ఇక కంపెనీల్లో అతి ముఖ్యులైన ఉద్యోగులు తమ కార్యాలయాలకు వెళ్లక తప్పదు. అలాంటి వారు మీటింగ్స్ సమయాన్ని కూడా బాగా తగ్గించుకోవాలని మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ జేర్డ్ స్పటారో సూచించారు. అలాగే మీటింగ్స్ నిర్వహించేటప్పుడు ‘బ్యాక్ టు బ్యాక్' విధానం పాటిస్తే అందరికీ మేలు అన్నారు. బ్యాక్ టు బ్యాక్ విధనం అంటే.. మీటింగ్‌లో పాల్గొనే వ్యక్తులు పరస్పరం ఎదురెదురుగా కాకుండా, వీపులు తాకేలా కూర్చోవడం అన్నమాట. అంతేకాదు, ప్రస్తుత పరిస్థితుల్లో టీమ్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యమని, ఈ విషయంలో టీమ్ లీడర్లు, మేనేజర్లు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా మైక్రోసాఫ్ట్ సూచించింది.

English summary

Microsoft CEO Satya Nadella's tips for work from home employees

Work from home may be a necessity today but in the post-coronavirus world, remote working may stay. And if that’s the case, it’s time to look at the early lessons, as identified by Microsoft CEO Satya Nadella recently.
Story first published: Tuesday, March 31, 2020, 19:34 [IST]
Company Search