మ్యూచువల్ ఫండ్స్ అదరగొట్టాయి, రూ.30 లక్షల కోట్లకు..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. గత మూడేళ్లలో దేశీయ మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ ఆశ్తుల నిర్వహణ వృద్ధి రేటు 8.78 శాతంగా నమోదయింది. 2017లో రూ.21.3 లక్షల కోట్లుగా ఉన్న మ్యూచువల్ ఫడ్ ఆస్తుల వ్యాల్యూ నవంబర్ నెలాఖరుకు రూ.30 లక్షల కోట్లకు చేరింది. రూ.8.7 లక్షల కోట్లు పెరిగాయి. 2025 నాటికి రూ.50 లక్షల కోట్లను తాకవచ్చునని మార్కెట్ నిపుణుల అంచనా.
ఈక్విటీ మార్కెట్ల ఇటీవల ఎప్పటికప్పుడు సరికొత్త శిఖరాలను తాకుతోంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ వైపు ఆకర్షితులవుతున్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఏడేళ్ల క్రితం (2013మార్చి) 4.28 కోట్లుగా ఉన్న మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు, 2020 సెప్టెంబర్ చివరి నాటికి 9.33 కోట్లకు పెరిగారు. ఈక్విటీ ఫండ్స్ నుండి రూ.12,917 కోట్ల నికర ప్రవాహం ద్వారా ఇది స్పష్టమైంది.

మార్కెట్ టు మార్కెట్ లాభాల కారణంగా పరిశ్రమ ఈక్విటీ ఆస్తులు అక్టోబర్ 30 నుండి నవంబర్ 30వ తేదీ నాటికి10 శాతం పెరిగాయి. రూ.7.77 లక్షల కోట్ల నుండి దాదాపు రూ.8.6 లక్షల కోట్లు పెరిగాయి.