For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగితో రిలేషన్‌షిప్: మెక్ డొనాల్డ్ సీఈవో తొలగింపు

|

పేరొందిన ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్ డొనాల్డ్ సీఈవో స్టీవ్ ఈస్టర్ బ్రూక్‌ను కంపెనీ తొలగించింది. కంపెనీకి చెందిన ఓ ఉద్యోగితో సంబంధాలు నెరపుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను తొలగించారు. దీనిపై విచారణ జరిపిన అనంతరం వారి మధ్య రొమాంటికి రిలేషన్‌షిప్ ఉందని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.

సహచరులకు రాసిన లేఖలో తనపై ఉన్న ఆరోపణలను స్టీవ్ అంగీకరించారు. ఇది సంస్థ నిబంధనలకు విరుద్ధమని, కాబట్టి కంపెనీ బాధ్యతల నుంచి వైదొలిగేందుకు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కంపెనీ వ్యాల్యూస్ ప్రకారం బోర్డు నిర్ణయించిన ప్రకారం తాను వెళ్లిపోవాల్సి వచ్చిందని చెప్పారు.

 McDonalds CEO fired over Consensual Relationship with employee

ఆయనపై వచ్చిన ఆరోపణల మీద మెక్ డొనాల్డ్ బోర్డు విచారణ జరిపింది. అనంతరం స్టీవ్‌ను తొలగించాలనే ప్రతిపాదనకు సభ్యులు ఓకే చెప్పారు. ఆ తర్వాత కంపెనీ బోర్డు నుంచి కూడా అతనిని తొలగించాలని నిర్ణయించారు. ఆయనకు ఇవ్వాల్సిన ప్యాకేజీ వివరాలను మరుసటి రోజు వెల్లడించనున్నట్లు తెలిపింది. కొత్త సీఈవోగా అమెరికా మెక్ డొనాల్డ్ అధ్యక్షుడిగా పని చేసిన క్రిస్ కెంపీజీజిన్‌స్కీ పేరును సభ్యులు ప్రతిపాదించారు.

English summary

ఉద్యోగితో రిలేషన్‌షిప్: మెక్ డొనాల్డ్ సీఈవో తొలగింపు | McDonald's CEO fired over Consensual Relationship with employee

McDonald's fired CEO Steve Easterbrook after the fast food giant's board of directors found that he demonstrated poor judgment in a consensual relationship with an employee, the company announced Sunday.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X