For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Market Closing: బంపర్ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. కారణమేంటంటే..?

|

Market Closing: ఉదయం మార్కెట్ల ప్రారంభ సమయంలో ఊగిసలాడిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి భారీ లాభాల నడుమ ప్రయాణాన్ని ముగించాయి. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు 1 శాతం మేర లాభపడ్డాయి.

మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 629 పాయింట్లు లాభ పడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 178 పాయింట్ల మేర లాభపడింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 337 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 268 పాయింట్ల మేర లాభపడ్డాయి.

 stockmarket

దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంచి లాభాల్లో ముగియటానికి కారణాలను గమనిస్తే ముందుగా మార్చి త్రైమాసికం జీడీపీ విడుదల కావటం ఒక కారణంగా ఉంది. ఈ కాలంలో జీడీపీ వృద్ధి 5.1 శాతంగా నమోదైంది. ఇది మార్కెట్లలో జోష్ నింపగా.. దేశంలో వర్షపాతం సాధారణంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ వెల్లడించటం కూడా మార్కెట్లను లాభాల వైపు నడిపించింది. అలాగే దేశీయ బ్యాంకింగ్ రంగం మెరుగైన పనితీరు, అమెరికా డెట్ సీలింగ్ లిమిట్స్, పెట్టుబడిదారులు ఎనిమిది కోర్, ఫిస్కల్ డెఫిసిట్, GST నంబర్లు, నెలవారీ ఆటో, PMI సేవలు, వచ్చే వారంలో తయారీ డేటా కోసం ఎదురుచూస్తున్నారు.

మార్కెట్లు ముగిసే సమయంలో ఎన్ఎస్ఈలోని రిలయన్స్, సన్ ఫార్మా, హిందాల్కొ, హిందుస్థాన్ యూనీలివర్, హెచ్సీఎల్ టెక్, దివీస్ ల్యాబ్స్, విప్రో, యూపీఎల్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఎస్బీఐ లైఫ్, టాటా కన్జూమర్, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, టైటాన్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ లైఫ్ కంపెనీల షేర్లు టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.

ఇదే క్రమంలో సూచీలోని ఓఎన్జీసీ, గ్రాసిమ్, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్ టెల్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల షేర్లు మాత్రమే నష్టాల్లో కొనసాగుతున్నాయి. దాదాపుగా అన్ని రంగాలు గ్రీన్ కలర్లో ప్రయాణాన్ని ముగించాయి.

Read more about: stock market nifty sensex nse bse
English summary

Market Closing: బంపర్ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. కారణమేంటంటే..? | markets closed in bumper profits as nifty sensex gained by 1 percent

markets closed in bumper profits as nifty sensex gained by 1 percent
Story first published: Friday, May 26, 2023, 16:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X