For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, బ్యాంక్ సూచీలే కారణం.. ఎందుకంటే? ఐటీ షేర్ల దూకుడు

|

ముంబై: స్టాక్‌మార్కెట్లు సోమవారం(జూలై 27) భారీనష్టాల్లో ముగిశాయి.బ్యాంకింగ్ సెక్టార్ భారీ నష్టాలకు కారణమైంది. ప్రయివేటురంగ బ్యాంకు షేర్లతో పాటు ఫార్మా, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లు నష్టాలను చవిచూశాయి. ఐటీ, మెటల్ షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి. దీంతో సెన్సెక్స్ 194 పాయింట్లు(0.51 శాతం) నష్టపోయి 37,934.73 వద్ద, నిఫ్టీ 87 62 పాయింట్లు పడిపోయి 11,132 వద్ద ముగిసింది. ప్రధానంగా ఫైనాన్షియల్ సెక్టార్స్ దెబ్బతీశాయి. నిఫ్టీ బ్యాంక్ 3 శాతం పడిపోయింది.

లోన్స్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్, వడ్డీ రేట్లు మరింతగా తగ్గే ఛాన్స్!లోన్స్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్, వడ్డీ రేట్లు మరింతగా తగ్గే ఛాన్స్!

ఐటీ స్టాక్స్ 52 వారాల గరిష్టానికి

ఐటీ స్టాక్స్ 52 వారాల గరిష్టానికి

ప్రధాన కంపెనీల్లో ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ నిఫ్టీ 45 పాయింట్లు లాభపడగా, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకులు 87 పాయింట్లు కోల్పోయాయి.

- నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 52 వారాల గరిష్టానికి చేరుకుంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.

- రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ రోజు 0.5 శాతం ఎగిసి రూ.2,155 వద్ద క్లోజ్ అయింది.

- కొటక్ మహీంద్రా 2 శాతం, ఐసీఐసీఐ 6 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంకు 3 శాతం నష్టపోయాయి.

- మారికో 2 శాతం నష్టపోయింది.

- సెన్సెక్స్30లో 17 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.

- టాప్ ఇండెక్స్ గెయినర్స్‌లో ఏషియన్ పేయింట్స్ (3.46%), HCL టెక్(2.99%), ఇన్ఫోసిస్ (2.56%) ఉన్నాయి.

- టాప్ లూజర్స్ జాబితాలో ICICI బ్యాంకు(6.05%), HDFC బ్యాంకు(3.47%), యాక్సిస్ బ్యాంకు (3.09%) ఉన్నాయి.

- బ్యాంక్ నిఫ్టీ దాదాపు 4 శాతం పడిపోయింది. ఫార్మా, రియల్టీ 1.7 శాతం చొప్పున నష్టపోయాయి.

బ్యాంకు షేర్ల పతనానికి కారణం

బ్యాంకు షేర్ల పతనానికి కారణం

కరోనా కారణంగా బ్యాంకింగ్ రంగం పలు సవాళ్లను ఎదుర్కొంటోందని ఆర్బీఐ అభిప్రాయపడింది. ఈ ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకు వాణిజ్య బ్యాంకుల స్థూల మొండి బకాయిలు 8.5 శాతం నుంచి 12.5 శాతానికి పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. మందగనం, విదేశీ పరిస్థితులు, మారటోరియం తదితర పలు అంశాలు బ్యాంకింగ్ రంగానికి సవాళ్లుగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకింగ రంగ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. దీంతో మార్కెట్లు డీలాపడ్డాయి.

డాలర్‌తో రూపాయి మారకం

డాలర్‌తో రూపాయి మారకం

నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(FPI) రూ. 410 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దేశీయ ఫండ్స్(DII) రూ. 1003 కోట్లను వెనక్కి తీసుకున్నాయి. గురువారం FPIలు రూ. 1740 కోట్లకు పైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా, డీఐఐలు రూ. 932 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. మార్కెట్లు ఉదయం నుండి మందకోడిగానే ఉన్నాయి. ప్రారంభంలో 160 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ ఆ తర్వాత ఊగిసలాట మధ్య చివరకు 194 పాయింట్లు కోల్పోయింది. ఇక డాలర్‌తో రూపాయి మారకం విలువ 74.83 వద్ద ట్రేడ్ అయింది.

English summary

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, బ్యాంక్ సూచీలే కారణం.. ఎందుకంటే? ఐటీ షేర్ల దూకుడు | Market closes in red, bank index slips 800 points

Among sectors, IT and metal indices ended in the green, while banks, pharma, auto and FMCG remained under pressure.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X