8 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.94 లక్షల కోట్లు జంప్
ముంబై: టాప్ 10 కంపెనీల్లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం భారీగా పెరిగింది. అంతకుముందు వరుసగా రెండు వారాల పాటు ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ క్షీణించింది. బడ్జెట్ అనంతరం భారీగా లాభపడిన మార్కెట్లు, అంతకుముందువారం నష్టపోయాయి. అంతకుముందు వారం ప్రారంభంలో కాస్త లాభాలు నమోదు చేసినప్పటికీ, చివరికి భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ వారం తిరిగి లాభపడ్డాయి. దీంతో టాప్ 10లోని 8 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.94 లక్షల కోట్లు పెరిగింది. అంతకుముందు వారం టాప్ 10లోని 9 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2,19,920.71 లక్షల కోట్లు తగ్గింది. ఇప్పుడు దాదాపు ఆ మేరకు పెరిగింది.

ఈ బ్యాంకుల మార్కెట్ క్యాప్ డౌన్
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), ప్రయివేటురంగ దిగ్గజం HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం క్షీణించింది.
HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.2,590.08 కోట్లు క్షీణించి రూ.8,42,962.45 కోట్లకు తగ్గింది.
SBI మార్కెట్ క్యాప్ రూ.5,711.75 తగ్గి రూ.3,42,526.59 కోట్లుగా నమోదయింది.

రిలయన్స్ ఎం-క్యాప్ జూమ్
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.60,034.51 కోట్లు పెరిగి రూ.13,81,078.86 కోట్లకు చేరుకుంది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మార్కెట్ క్యాప్ రూ.41,040.98 కోట్లు ఎగిసి రూ.11,12,304.75 కోట్లకు చేరుకుంది.
కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.28,011.19 పెరిగి రూ.3,81,092.82 కోట్లకు చేరింది.
హిందుస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ రూ.16,388.16 కోట్లు లాభపడి రూ.5,17,325.3 కోట్లకు చేరుకుంది.
ఇన్ఫోసిస్ ఎంక్యాప్ రూ.27,114.19 కోట్లు పెరిగి రూ.5,60,601.26 కోట్లుగా ఉంది.
ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.8,424.22 కోట్లు ఎగిసి రూ.4,21,503.09 కోట్లకు చేరుకుంది.

టాప్ 10 కంపెనీలు వరుసగా
రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.14 లక్షలకోట్ల సమీపానికి చేరుకుంది. టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.11 లక్షల కోట్లకు పైగా ఉంది. టాప్ 10 కంపెనీలు వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్, TCS, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, HDFC, ICICI బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, SBI, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి. గత వారం సెన్సెక్స్ 1305 పాయింట్లు లేదా 2.65 శాతం లాభపడింది.